Posts

Showing posts from December, 2017

బామ్మతో నా ప్రయాణం బామ్మ లేనప్పుడు

నా మనసు మూగబోయిన ప్రతిసారీ అద్దం పట్టిన తాను మూగబోయి మూడేళ్లు దాటినా తన మౌనం నాతో ఇంకా మాట్లాడుతూనే ఉంది. అప్పుడూ అంతే రోజూ పడుకునే ముందు వేరే వారి జీవిత గాధలు. ఇప్పుడు కూడా తన జీవన సారాంశమే రోజుకొకటిలా నా జీవనాన్ని సాగించడానికి. ఈ ఏడ్పు మొహాన్ని, ఉన్నప్పుడల్లా నవ్వించి, పోయి ఈ రాతి గుండెతో కన్నీళ్లు కారిస్తుంది. కోపమో అలకో తన మీద నాకు నా మీద తనకూ ఎప్పుడూ లేదు అయినా తనని తాను దండించుకొని నాకు శిక్ష విదించిపోయింది. ముళ్లదారున్నంతసేపు నా తోడు గా పట్టుకు నడిపించింది, రహదారి వరకు. అది రాగానే తన ఆసర ఇంక అక్కర్లెదనుకుందో ఏమో. కానీ ఎట్ల చెప్పను బామ్మతో నా ప్రయాణం, బామ్మ లేనప్పుడు కన్నీటితో మొదలు, కన్నీటితో ముగింపు నా పుట్టుక, తన చావు లాగా... ~భావన

తెర చాటు

తెర చాటు దాగున్న, అచ్చం నీ కొంగు చాటునున్నట్టు కానీ ఈ సారీ ప్రపంచం నువ్వు చదివి వినిప్పించిన పుస్తకాల్లతో కాక ప్రజలతో చూస్తూ ~భావన