ఆశ కోసం...
ఆశ కోసం... అందమెంతో ఉందనుకున్నా అనర్దమైన జీవితంలో ఆటంకాలెన్ని ఎదురొచ్చినా ఆటలే అన్నీ అని ఆకర్షితమయ్యా ఇక్కట్లే ఎన్ని వచ్చినా ఇష్టంగా తలొగ్గిన..తలెత్తినా..ఎదురొడ్డినా... విమర్శలే ఎన్ని చేసినా సున్నితమైన నా మనసు తట్టుకోలేదని తెలిసినా ప్రేమ అనే కొవ్వత్తిని ఏనాటికైనా వెలిగించాలని అనుబంధమనేది ఆచరనే అవ్వాలని ఆప్యాయతలు ఆపద్భాంధవుడై తోడు నిలవాలని గాయాలను గుండెలోనే దాచి నా ఆశయానికి ఆశనే మందుగా ఇస్తూ ఇలా వేధాంత విధానాలుగ నిలుస్తున్న మనుషుల మనసుల మార్పు కోసం వేచిచుస్తూ ఆశల కిరణాల కోసం జీవిస్తున్నా...