పంచభూతాలతో నా అనుబంధం
గాలితో నా మాటలు మొదలెట్టినా నూ ఆహుతై దానితో పాటు పయనిస్తున్నప్పటినుంచి అగ్గితో ఆటాడూకోడంలో ఇక భయం పోయింది అది నీ శాశ్వత నిద్రకు పానుపు అయినప్పటినుంచి ఆ నీరు నా మనసుని మరింత హత్తుకుంటుంది (అది కన్నీరయినా) నీ అస్తికలు దానిలో కలిసినప్పటినుంచి ఈ భూమి మీద మక్కువ మరింత పెరిగింది నిన్ను తనలోకి ఆహ్వానించినప్పటినుంచి అందుకేనేమో ఈ పంచభూతాలతో నా అనుబంధం మరింత ధృడపడింది నన్ను అంత తేలికగా ఓటమి అంచులలోకి పోనీకుండ ఆపుతుంది ~భావన