పంచభూతాలతో నా అనుబంధం
గాలితో నా మాటలు మొదలెట్టినా
నూ ఆహుతై దానితో పాటు పయనిస్తున్నప్పటినుంచి
అగ్గితో ఆటాడూకోడంలో ఇక భయం పోయింది
అది నీ శాశ్వత నిద్రకు పానుపు అయినప్పటినుంచి
ఆ నీరు నా మనసుని మరింత హత్తుకుంటుంది (అది కన్నీరయినా)
నీ అస్తికలు దానిలో కలిసినప్పటినుంచి
ఈ భూమి మీద మక్కువ మరింత పెరిగింది
నిన్ను తనలోకి ఆహ్వానించినప్పటినుంచి
అందుకేనేమో ఈ పంచభూతాలతో నా అనుబంధం మరింత ధృడపడింది
నన్ను అంత తేలికగా ఓటమి అంచులలోకి పోనీకుండ ఆపుతుంది
~భావన

Comments
Post a Comment