Posts

నువ్వే !!!

అన్నిటా నువ్వే  అంతటా నువ్వే  అలలా వచ్చి  కోవలై వెలసి ఆత్మీయత రాగాలే పంచి అనురాగపు సందడిలే పెంచి ప్రేమనే ఒడిలొ ప్రళయమనే భావుతానే మిగిల్చి ఈనాడు పిలిచినా పలకవేమి ఏనాడు వీడనని మరిచిపోయి.. ఎడారినె మరల చేర్చి అదవిలొ మరల దూర్చి పిలిచినా పలకవేమి ఏనాడు వీడనని మరచిపోయి.. ప్రేమనే ముంగింత్లో  సంక్రాంతి ముగ్గులలో ఆత్మీయ రాగాలే మామిడాకులైతుంటే ఈనాడు ఆ అనురాగాలు సంకెళ్లే కాదా!! ఆనాటి బంధుత్వాలు జీవితాల ఆ లోకాలు ఈనాడు విడిచి వీడనని మరిచిపోయి వెలుతుంటే ఏమని చెప్పేది.. ఎంతని ఆపేది.. పొమ్మని చెప్పలేక.. పోతుంటె చూడలేక.. పిలిచినా పలకకా ....

ఏ రోజు ఏమి జరుగునో????

ఏ రోజు ఏమి జరుగునో  ఎవరికీ మాత్రం తెలుసును కళ్ల ముందు జరిగేదేదో  కళ్లు మూచి తెరిచే లోపే జరిగిపోవునే  జరిగింది జరుగుతుందేమోనని  జరిగేది జరగబోయేది తలచి మురవడం ఊహించిందే జరగాలంటూ  తలచిందే కనపదాలంటూ ఆఘ్న వేయడం,ఆలోచించడం ఆగ్రహించడం,ఆవేధనచెంధడం  ఎంత వరకు న్యాయం? ఎంధరికిది సాధ్యం? విధి నీ హస్తమ? లేక     విధి నీ నేస్తమా? కాళ్ళ ముందు జరిగింది  నీ దరికి నవ్వుతోని స్వీకరించేది  హాయిగా జీవించునది విజయాలకు చేరువ అది విజయభాటలో పయనించేది అది కానీ, భాదపడడం కాదు ఈ విధి మీద నీ నిందలు కాదు