Pain

కలగన్న శిఖరాల్లన్నీ కరిగిపొతునట్టు 
చెట్టు ని భూమినుంచి వేరుచేయడానికి ఏర్లనన్ని ఒక్కసారిగా లాగుతునట్టు 
భూలోపల ఆప్యాయంగ హత్తుకున్న యేర్ల మీద విజయం సాధించలేక 
ఒదిలేసి భూకంపాన్ని సృష్టించినట్టు 
ఆలోచనలకి సంకెళ్లు ఎయ్యలేక 
దేహాన్ని సంకేళ్లతో కదలనీకుండా చేసినట్టు 
అలసిన ప్రాణం సేదతీరుదాం అనుకోవడమే ఆలస్యం, 
నూ ఉన్నది యుద్దభూమిలో అంటూ కాళ్లకి విశ్రాంతి లేకుండా చేసినట్టు 
నా అనే అన్నీ తీసుకుపోతుంది 
ఊపిరిని మాత్రం నాకొదిలేసి... 

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)