Posts

Showing posts from November, 2008

వేదన

విధి ఆడిన వింత నాటకం వేదిస్తుంటే మది పాడిన అనురాగ గానం బాధిస్తుంటే విధిలో విలీనమైన నిన్ను కలత చెందిస్తుంటే ప్రేమ గీతం, ఆప్యాయమైన మాట నిందిస్తుంటే తప్పని భావుస్తుంటే చందమామ మోముపై మిగిలిన మచ్చలా మదిలో ఈ నా తప్పు బాధిస్తుంటే వెంటాడి వేదిస్తుంటే నా మదికేదీ సమాధానం శ్రుతిమించిన నా గానం స్థితి తప్పని నా రాగమ్మ్ స్నేహమే నా తోడు రానంటుంటే  మది నిండిన స్నేహానికి నా మాటేలా నీడైన నా నేస్తం ఇక తోడురానంటుంటే  నీడలోని నా మనసు భావమేలా 

మానవత్వమా....

మానవత్వమా..దైవత్వానికి మరో రూపమా.. నీ జాడే లేక మిగిలిన లోకానికి దారే చూపుమా.. మనిషికి రూపం మానవత్వమైతే మానవత్వం ఉందో లేదో అన్న నా మనసుకి మనిషిని చూపే దారే తెలుపుమా..  ప్రేమా,శాంతి,నిస్వార్థం,త్యాగం మానవత్వ ప్రతి రూపాలైతే మనిషన్న వాడే ఈ లోకంలో ఉన్నాడా? లేడా?? సత్యం,స్వచ్ఛత మానవత్వపు చొటైతే?  మానవ లోకమే లేదా? మనిషన్న వాడే ముందుకు రాడా?? నాశనం,కోపం,ద్వేషం అన్నిటికీ రూపాన్నిస్తుంటే.. ఆర్తనాధాలు.. ఆవేదనలు.. అవరోధాలు.. ఆటంకాలు ఇవి మనసుకి లోకం అవుతుంటే.. మనిషన్న వాడే ముందుకు రాడేంటి? మానవత్వమా..దైవత్వానికి ప్రతిరూపమా.. నీ జాడే లేక మిగిలిన లోకంలో నీకు చొటే నిల్వక నలుగుతున్న రాజ్యంలో  నా దారే ఉందటూ చూపక రావా!!!

youth

నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా... వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా  హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ... నీడజాల్ల అందల్లాన్నే అందుకొని  నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా ఆనందంగా ముందుకు సాగిపోరా.. వానరాల్లాగా  ఆడుతూ పాడుతూ  జీవితమంతా గేన్తులేస్తూ ముందుకే సాగిపోతూ  విజయపతకానికే చేరుకోర... ఎన్ని హదులోచినా,ఆటంకాలే ఎదురయ్నా..  ఎదురించీ శక్తే వారయ్యి  దుసుకుపోరా             ముందుకు వారే సాగిపోరా .. ఆశలన్నిటికి రెక్కలు కట్టి సంతోషాన్నే  అందుకోని జీవితాన్నే చిన్ని స్వర్గంగా మార్చుకోరా.. కృషి పట్టుదలే ఆయుధంగా మార్చుకొని      విజయమే వారి బానీసగా చేర్చుకొరా... నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా... వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా  హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ... నీడజాల్ల అందల్లాన్నే అందుకొని  నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా ఆనందంగా ముందుకు సాగిపోరా.. వానరాల్లాగా  ఆడుతూ పాడుతూ  జీవితమంతా గే...