మానవత్వమా....

మానవత్వమా..దైవత్వానికి మరో రూపమా..
నీ జాడే లేక మిగిలిన లోకానికి దారే చూపుమా..
మనిషికి రూపం మానవత్వమైతే
మానవత్వం ఉందో లేదో అన్న నా మనసుకి
మనిషిని చూపే దారే తెలుపుమా.. 
ప్రేమా,శాంతి,నిస్వార్థం,త్యాగం
మానవత్వ ప్రతి రూపాలైతే
మనిషన్న వాడే ఈ లోకంలో ఉన్నాడా? లేడా??
సత్యం,స్వచ్ఛత మానవత్వపు చొటైతే? 
మానవ లోకమే లేదా? మనిషన్న వాడే ముందుకు రాడా??
నాశనం,కోపం,ద్వేషం అన్నిటికీ రూపాన్నిస్తుంటే..
ఆర్తనాధాలు.. ఆవేదనలు.. అవరోధాలు.. ఆటంకాలు
ఇవి మనసుకి లోకం అవుతుంటే..
మనిషన్న వాడే ముందుకు రాడేంటి?
మానవత్వమా..దైవత్వానికి ప్రతిరూపమా..
నీ జాడే లేక మిగిలిన లోకంలో
నీకు చొటే నిల్వక నలుగుతున్న రాజ్యంలో 
నా దారే ఉందటూ చూపక రావా!!!

Comments

Post a Comment

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)