ఆవేదనాలి

మే నవమాసాలు మోసీ కనే తల్లిమైనా 
ఆ పేగు బంధాన్ని మరిచి,మెడపై చుట్టుకున్న మృగాలై మీరు మారినా
ఒక ఆలినై మీ జీవితాన్నే మట్టు కరుపుంచేల కౄరులుగా మీరు మారినా
ఒక అక్కగా,చెల్లిగా ఎల్లప్పుడు మీ అండగా నిలుస్తామని శపదం చేసినా 
అది శాపమై మము నిలువెల్లా చీల్చినా
భూమికి దిగివచిన తారలము మేమైనా 
ఒక తారగా ఆకాశ శూన్యంలోకి పంపాలని మీరు ప్రయత్నము చేయదల్చినా

నూ గుక్కుపెట్టుకుని ఏడుస్తున్న సమయాన 
మా ఎద పై మిమ్ము లాలించినా
ఆ ఎదలోతుల్లో దాగున్న గుండె చప్పుడిని ఆపాలని మీరు ప్రయత్నిచంచినా
ఆకలితో అలమడిస్తున్నప్పుడు మా అవయవాలు కరిగించి మీకు పాలు తాగించినా..

ఆ అవయాల్నే తునతునకలు మీరు చేసినా
మే పాడే జోలపాట మిము నిద్రపుచడానికైనా
మము శాశ్వత నిద్రలోకి పంపాలని మీకు దురహంకారమున్నా
మే పసిముగ్గల్లా మిము లాలించినా
క్రూర మృగములా మా పై హత్యాచారానికి మీరు ఎగపడినా
మీ మోములొని చిరునవ్వు కోసం ఎల్లవేలలా మే శ్రమించినా
మా మోము జాడే తేలికుండా చేయాలనే మీది రాక్షస ప్రయత్నమైనా
మీరు తప్పటదుగులు వేస్తున్న సమయాన వేలు పట్టుకుని నడిపించింది మేమైనా
చెడు దారిలో నడిచి ఆ చేయినే లాగి బలాత్కారము మీరు చేయబోయినా
మనిషిగా కాక ఒక మృగముకన్న హీనంగ మీరు తయరయ్యి ఎన్ని అభియొగాలు మోపినా
సత్యభామ అయి నరకాసురినే హతమొందించినా
ఓ  సీతగా మా పవిత్రతనే మీరు ప్రశ్నించినా 
ద్రౌపది మానాన్ని తాకట్టుపెత్తినా
కుంతీ దేవికి నిస్సహాయతే మిగిల్చినా
మీ పై మమకారము
మా సంస్కారము ఎన్నడూ వీడనీక 
ఒక ఆలిగా.. తల్లిగా.. చెల్లిగా.. అక్కగా... నేస్తానిగా.. 
ఈ భూమికి సృష్టికర్తగా మిగిలే ఉన్నాము
ఈ భూమాత శోకతీరంలో తలదాల్చుకుంటూ
మార్పుకౌ.. మా సమ్రక్షణ కోసమై వేచిచుస్తాము 
లేక
ఓ భద్రకాళి యై మరల అరంగేట్రము చేస్తాము..

Comments

  1. చాలా బాగుంది బావా.. హృద‌యానికి హ‌త్తుకు పోయింది.. కాని మ‌నిషిలో కృర‌త్వం ఉంటుంది..
    మృగానికేటే అది ఎక్కువే ఉంటుంది.. కాని ఆ మృగ‌త‌త్వం ఆడ, మ‌గ అన్న తేడా లేదు..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)