అన్నా!
కోట్లాది మంది ప్రాణుల విలువల కోసం
పయనించి, ప్రవహించి అలసిసొలసితివా అన్నా!
ఈ భూతల్లి కోసం నీ ప్రాణాలను పనంగా పెట్టినా ఓ మాతాపుత్రుడా!
ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన నిన్ను అస్తమింపజేసినా
పాపం! తెలియదేమో ఆ రాక్షస పాలకులకు,
నీ ఊపిరి మాకందించి ఒక వేగుచుక్కవై నిలువడానికి
మాకు దూరంగా వెళ్లావని...
నీ పాదాల జాడలు మాసిపోతాయా ఏనాటికయ్న?? వెర్రివాళ్లు కానీ..
ఓ ఉద్యమ సూరీడా!
నువ్వు వెదజల్లే ఆ సూర్యకిరణాల తోవలోనే మేము పయనిస్తామని ఈ ప్రతీన..
Comments
Post a Comment