నా జీవనం!

నా జీవనం
నే సాగే పయనం
అది అందరి కలయిక
చేదు, తీపి, కారం, పులుపు
ఉగాది పచ్చడి లాగె అదీ సమాహారం
సంతోషం, దు:ఖం అవే నేస్తాలు
ఎన్నో ఒడిదుడుకులు..
అన్నీ ఆనందమే 
ఎన్నో ఎదురుగాలులు
అన్నీ నిబ్బరాన్ని నింపినవే
సూర్యచంద్రుల ప్రతిబింబం
ఇదే నా జీవితం
నే సాగే ప్రయాణం

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)