తెలంగాణం

భూమి, నీరు నా పంటా చేను
బొగ్గు  బావి అయినా కరెంటు కోత
టెక్స్టైల్సు,మిల్సు అన్నీ కూల్చివేత
ఏర్ఫీల్డు పోర్టుగా మారని తలరాత

డిగ్రీలు, పి.జి. లు అని ఎన్నీ చద్వినా
కూటికి,పూటకి దిక్కే లేదురా
తెలుగు భాషా ఒకటే అంటున్నా
మా యాసా ఘోష ఎవరికి ఎక్కేనురా..

అరవయ్ ఏళ్ల బానిసత్వం
వాక్కు హక్కు లాఠీ మింగినా
కేసులు,షీట్లు, ఎన్నో నింపినా
రక్తపు బొట్టు నేలే రాలినా 
కన్న ప్రాణాలు కొట్టుకు పోయినా 
కసాయిధారులు రాజ్యమేలినా 
నినాదపు గొంతులు నిమిరేసినా.. స్వరమవ్వురా....

నువూ,నేను అన్నాదమ్ములంటా 
విడిపోతే ఇద్దరం సమతుల్యమంటా ||2||
కలిసుండి ఎవరికి నోచని భాగ్యమే ఎందుకురా 
విడిపోయి సమైక్యంగ అభివృద్ది నిచ్చనే ఎక్కేమురా
నువ్వు,నేను అంతా సహోదరులేరా..

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

పంచభూతాలతో నా అనుబంధం

ఈరోజు నిన్నేగా