అమ్మా!

గోరువంక చూపించి
గోరు ముద్దలు తినిపించి
మాటలతో మరిపించి
మా గాయాన్నే మరిపించే  
అమ్మా! మీ మాయేంటో తెలుసునే
మా జీవితంలో మీ మమతే చాలునే
కష్ట కాలం వచ్చిందంటే
ఎదురించే శక్తే నీవని
ఒడిదుడుకులు ఎన్నీ ఉన్నగాని
వెనకడుగే వేయక సాగిపోమని
ఇచ్చిన నీ ధైర్యం చాలునే ఈ జీవితాన... 
  తప్పు తప్పుగా సరిదిద్దుతుంటే
  ఒప్పులు తప్పేల అని తప్పుగా భావించానే
ఈనాడే తెలిసిందే అమ్మ గొప్పేంటో
మనిషిని మనిషిగా మార్చే మీ గణతేంటో
నిను వీడాక తెలిసిందే
    మిము వీడలేక ఉండలేమని 
మీరే ఈ జీవితమూర్తులని..
           లోకకర్తలనీ!!! 

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)