విను ఓ నా లోకం!!!



పొద్దున్నే లేసి పడకెక్కే దాక
రియ్యు రియ్యు మంటు తిరిగే నా లోకం

అటుపక్క సిన్నారుల రింగుబిల్ల ఆట సూడు
రింగంత భూమిని సుట్టేస్తున్నంత నవ్వుల జలపాతం

ఇటుపక్క కోయిల కూ కూ రాగాలకు నర్తించే పూ కొమ్మని సూడు
ఆస్వాదించే అమ్మ నాన్నా పలుకులు అంధించ నిలుచున్నది చూస్తూ

సూటు, బూటు ఏసుకొని
బుక్కు, ఫైలు చేత పట్టుకుని
కార్ ల తుర్రమన్న వైనం

భూమంత అల్లిన పచ్చని పానుపుపై నీ పాదం స్పర్శించి చూడు
గుండె బరువుని, బుర్ర వేడిని తనలో ఆవహించుకునే మురిపెం

అలసి సొలిసిన నీ తనువుని కాస్త చేయనీయకు మారం
పొద్దెక్కినాక అస్తమించే సూరీడు మరల రావలి పాపం!

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)