ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను



ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

తెగి పడిన తల,
నాలాగే బతుకెతుక్కుంటున్న బాటసారిదే కాని
నాది కాదనా?

మూగబోయిన గాత్రం,
నన్ను ప్రేరేపించిన గళానిదే కాని
నాది కాదనా?

మసైపోయిన తనువు,
చీకటిని జయించ వచ్చిన కాగడాలదే కాని
నాది కాదనా?

చిందిన రక్తం, అయిన గాయం,
నాకోసం ఎదురొడ్డిన వాల్లదే కాని
నాది కాదనా?

సంకెళ్లతో బంధించబడ్డ సత్యం
చెరసాలలో నిందింపబడ్డ న్యాయం,
నాకోసం పిడికిళెత్తిన వాళ్లదే కాని
నాది కాదనా?

జీవచ్చవమయ్నా సరే,
జీవితం సాగించాలనుకుంటున్న నాకు
ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను
.
.
నీకై చూపిచ్చి!

~భావన

Comments

Popular posts from this blog

తెలంగాణ ఉద్యమం...

Telugu Quotes from me (Updated)