బంధాలు భావాలను ఏర్పరుస్తయ్ భావాలు భాషలకు ప్రాణం పోస్తయ్ కానీ, భాష వక్రీకరించినప్పుడే బంధాలు వంకరైపోతయి ఒకరి భావోద్వేగాలు అందనప్పుడే భాష్యం పగిలిన అద్దమైపోతది!
తెలంగాణ ఉద్యమం... ప్రతి వాది రక్తపు బొట్టులోప్రవహించే నాదం ఇది ప్రతి వాది గొంతుక పుటల్లొ దాగివున్న విప్లవ గీతం ఇది ప్రతి హ్రుదయపు అంచుల్లో నాటుకున్న ఉజ్వల భవిష్యత్తు ఇది ప్రతి ఊహల్లో ఉనికిసలాడే వీరోచ్చిత ఘట్టం ఇది అరవై ఏళ్లు;స్వాతంత్ర్య పోరాటాన్ని మించిన గాద ఇది బిగిసిన ప్రతి పిడికిలి యొక్క శిఖరాగ్న జ్వాల ఇది
గాలితో నా మాటలు మొదలెట్టినా నూ ఆహుతై దానితో పాటు పయనిస్తున్నప్పటినుంచి అగ్గితో ఆటాడూకోడంలో ఇక భయం పోయింది అది నీ శాశ్వత నిద్రకు పానుపు అయినప్పటినుంచి ఆ నీరు నా మనసుని మరింత హత్తుకుంటుంది (అది కన్నీరయినా) నీ అస్తికలు దానిలో కలిసినప్పటినుంచి ఈ భూమి మీద మక్కువ మరింత పెరిగింది నిన్ను తనలోకి ఆహ్వానించినప్పటినుంచి అందుకేనేమో ఈ పంచభూతాలతో నా అనుబంధం మరింత ధృడపడింది నన్ను అంత తేలికగా ఓటమి అంచులలోకి పోనీకుండ ఆపుతుంది ~భావన
నేను నిన్నటినేగా ఈరోజు నిన్న వల్లేగా ఈరోజటితో ఎంత అనుబంధమో నిన్నటితో అంత కంటే ఎక్కువ ప్రేమ ఎందుకంటే ఈరోజు నిన్నవల్లేగా ఎన్నటికయినా ఎప్పటి రేపటికయినా ఈరోజు నిన్నేగా ~భావన
Comments
Post a Comment