For Vivek
తమ్ముడా!
రక్కసు కక్కే రాబందుల పాలిట రణ నినాదాన్ని మోగించిన వీరుడా!
జన సర్కారే నా సర్కారని ఉద్యమించిన యోదుడా!
వికాసాన్ని విరజల్ల విప్లవ నినాదం అందుకున్న అమరుడా!
నేల రాలిన వివేకుడా తెలీదేమో పాపం ఈ చెడ్డ రాజ్యానికి నూ వేల కిరణాల్లా విజృంభిస్తూ మల్లా వస్తావని
తెలీదేమో పాపం ఈ సామ్రాజ్యవాద లుచ్చాకోర్లకి నీ రక్తపు బొట్టుతో తడిసిన ఈ నేల తల్లి పలు రెట్లు ప్రకాశించు ఎర్రని జెండాలా రెపరెపలాడుతూ ఉంటదని
~భావన
13.06.2015
Comments
Post a Comment