నువ్వుండాల్సింది బామ్మ

నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
నీ కల ఇప్పుడు శిఖరాన్ని అందుకొని ఆకాశంలో విహరిస్తున్నప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
ఓటమిలో నువ్విచ్చిన ధైర్యం విజయటంచుల్ని తాకుతున్నప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
ఇన్నేల్ల మీ వంట(అమ్మ,నీది) రుచి నా చెతితో తగులుతున్నప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
నువ్వన్న మాటలు నా బాటై నిలిస్తున్నప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
తుడిచిన నా కన్నీళ్లు నవ్వులా మారినప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
పట్టుదలతో సాగిన దూరం గౌరవంగా తిరిగి దరి చేరినప్పుడు
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
నేను వేచిచుస్తున్న నన్నిన్నేల్లు అక్కున చేర్చుకున్న ఆ కౌగిలింత కోసమైనా
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
నా సాధనకి అమ్మమ్మ గర్వంగా నా మనుమరాలని చెప్పినప్పుడు నూ లేని నా లోటు తీర్చడానికైనా
నువ్వుండాల్సింది బామ్మ నువ్వుండాల్సింది!
నీ కలలు ఒక్కటొక్కటిగా రూపాంతరం చెందుతునప్పుడు
ఆ నీ కళ్లను చూడాలన్న నా కల కోసమైనా
నువ్వుండాల్సింది బామ్మ! నువ్వుండాల్సింది!

--భావన

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)