ఎదురుచూపు
ప్రతీ జ్ఞాపకం నీదై
నా ప్రతీ వ్యాపకం నీవై
ఎదురుచూస్తున్నది ఓ నేస్తం
నా సంతోషం నీ కోసం..
జాలువారే నీ నవ్వు కోసం..
నన్ను పలుకరించె నీ మాటకోసం..
ఆనందం దరికి చెరుతుందని
పొంగి పారుతున్న ఆ గంగా నదిలా
మన స్నేహం...
వాన కాలం కొసం ఎన్నడు ఎదురుచూడదు
దు:ఖం వస్తున్నా
అది నిన్ను చూసి ..
నా దరి చేరడం ఆపేసింది.
దూరమైనామని పొరపడి
గెలిసి ఓడి ఆశ్ఛర్యంలో మునిగిపోతుంది
పాపం తెలీదేమో దానికి
కనుల దూరంలో లేకున్నా
మన కనులు ఒకటే చూస్తున్నాయని
మన మనసులు ఒకటే ఆలోచనలో ఉన్నాయని
Comments
Post a Comment