ఎందుకు?

మనిషిగా పుట్టినందుకు
అదీ ఓ ఆడపిల్లగా పుట్టినందుకు
ఆ ఆడపిల్ల తండ్రి ఎవరైనా
లెఫ్టిస్ట్ నుంచి సామ్రాజ్యవాదిగా మారాలా?
కమ్మ్యునిస్ట్ నుంచి కాపిటలిస్ట్గా మారాలా?
సంఘసంస్కర్త సంఘాన్ని ద్వేషించాలా?
చిన్నతనంలో ధైర్యంగ ఎదురొడ్డిన గుణం
తండ్రయ్యాక పిరికివాడిలా మారాలా?
చావునే ఎదురించిన బతుకు
చస్తూ బ్రతకాల??
ఎందుకు? ఎవరు కారణం? ఈ సమాజమా??
లేక ఆ తండ్రి నిస్సహాయతా?

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)