ప్రయాణం

అది ఒక పల్లెటూరు పక్కనున్న ఓ చిన్న పట్టణము. గజిబిజిగా, గంభీరంగా ఉండే ప్రదేశం అది. అటొక మెట్రోపొలిటెన్ సిటీకి, ఇటు పల్లేటూరుకు మధ్యనుండే ప్రాచుర్యం పొందుతున్న ఓ చారిత్రక నగరం. కనుమరుగవుతున్న పల్లెటూరు తత్త్వానికి, అతి చేరువలోవున్నా పూర్తిగా ఆవహించుకోని నాగరికత మధ్యలో జీవిస్తున్న ఆశావాహిత జీవితాలు. వారిలో ఒకరితో ఈ ప్రయాణం...
సూరీడు తన కాంతులను వెదజల్లకముందే తన చూపులతో ఈ లోకాన్ని స్వాగతిస్తూ తన ఇంటి ద్వారాన్ని తెరుస్తూ నడక ప్రారంభించాడు పొడుగాటి, బకపలుచని తాత, తన జీవిత అనుభవాల బరువుతో. అయినా దరి రాడే ఈ సూరీడు??
ఆ పాప చిరునవ్వుల కాంతి వెదజల్లకుండానే ఏల సూరీడు. అగొ, అదిగో చెవులు, కనులు రెండూ ఒక్క సారే తెరలేపినయి జీవన క్రాంతి వెతుకులాటని ఆ ఇంటిలొ. అటు, ఇటు గెంతులేస్తూ, అందరిని ఆగం చేసి లేపి, తన చిన్నరి పాదాలతో ఈ భువిని పలకరిస్తూ పులకింపజేస్తు తన కలనే వెంటాడుతున్న అన్నంత వేగంతో తడబడుతూ, ముందుకెళ్తూ దూసుకుపోతుంది తన గది నుంచి మరో గదిలోకి. బెడ్ పైకి ఎక్కి భామ్మ అంటూ మోము పై చిట్టి చేతులను రాల్చి లేపబోయి పడుకున్న ప్రశాంతతను చూసి ఆగిపోయింది. మెల్లిగా అవ్వ భుజాన తలబెట్టి మళ్లీ ఆహ్వానించింది అందరికి బగ్నం చేసిన నిదురను.
టీ కి ముందు అమ్మకు, పేపరుకు ముందు బాపు కు బిడ్డ తో కబురులు చెప్పడం అలవాటు. తన ఉనికి ఆనట్లేదు ఎంది. దాని అరుపులు ఏవి అనత్తు ఇద్దరు ముకాలు చుసుకొని ఏ గదిలో ఆడుకుంటుందో చూసొస్త అని అమ్మ చుదదానికి పోయింది. "ఏ గదిలొ లేదు" అన్న వల అమ్మ కేకకు, మ అమ్మ గదిలొ ఉండొచు చూసొస్త ఆగు అని అన్న పాప బాపుకి కానరాలేదు ఎవరు ఆ గదిలొ. గుబులుగా "పవనా! ఏడున్నవ్? పవన! పవనా!!" అంటూ ఇంటెనకకి వెల్లారు ఇద్దరు తల్లీ, తండ్రీ. అక్కడ మొక్కలకి నీల్లు పోస్తున్న బామ్మను చూసి " అమ్మా! పవనెక్కడా?" అని అడిగాడు పవన తండ్రి. పైకి లేస్తు, తిరిగి " అరె, ఇక్కడే ఉండాలిఘా. ఇప్పటిదాక ఇగో ఈ బీరకాయ విత్తనాలు నాటమనిగుంజుకొచ్చింది పెరట్లోకి. నీళ్లు పోసింది అదే మట్టితో ఆడుకుంటూ" అంటూనే చుట్టూ ఉన్న చెట్లూ, పొదల వైపు తన చూపులను తిప్పింది. " పవనా! ఎడున్నవ్ తల్లి" అని మల్లీ బామ్మ కేక. కాని ఉలుక్కు పలుకు ఉంటే కదా. ముగ్గురూ తల మూడు దిక్కులు చుస్తుండె సమయాన నాలుగో పక్కనుంచి గేటు చప్పుడు. చప్పుడు విన్న వెంటనె పలుకుల గుబాలింపు " తాతయ్యా!" అంటూ మల్లె పొదల్లోంచి ఉరుక్కుంటూ బయిటికి వచ్చి ఒక్కసారిగా ఎగిరి నీ ఆ రెండు చేతుల మధ్యలోనే నా లోకాన్ని చేరే దారుందన్నట్టు ఒదిగిపోయింది..
"అగో! దీనికి అల్లరి బాగా ఎక్కువైంది. పరేషాన్ చేసినవ్ కదే మమ్మల్ని" అని కోపంగా అమ్మ అంటుంటే అదేదొ చెమత్కారంలా నవ్వింది. ఆ నవ్వుకి ఏ నవ్వు చిగురించక ఆగుతుంది చెప్పండి. అందరి మోములో చిరునవ్వుని ప్రాప్తిస్తూ " ఎనుకు దాసుకున్నవ్ ఆ ఆ మల్లె పొదల్లో?" అన్న తాత ప్రశ్నకు " పేపరు కోసం" అని సమాధానమిస్తూ ఎడమ చేతిలోని పేపరును తన కుడి చేతితో గుంజుకొని, బలవంతంగా తాత భుజమ్నుంచి దిగి లోనికి ఉరికింది. అందరు ప్రశ్నార్ధకంతో పవనను అనుసరిస్తూ వెల్లారు లోపలికి. హాల్లులొ సోఫ మీద కూర్చొని పేపరి విప్పిన పవనను మల్లీ అదిగాదు నాన్న "పేపరు కోసం ఎందుకే?" అని ఏమి అర్ధం కానట్టు. " అబ్బ నాన్నా, మీరందరు నన్ను వెతికే పనిలో ఉంటేనే కదా నాకు పేపరు ఫస్టు దొరుకుతదీ" అని వెక్కిలి నవ్వుతో సమాధానమిచ్చింది. ఈ మాటలతో ఆశ్చర్యపోయి పవనను ఆలింగనం చేస్తూ " నీకు పేపరు ఎందుకు బిడ్డా?" అని అడిగిన నాన్నకు " నాన్నా! పొద్దు పొద్దున్నే తాతయ్య , తర్వాత నూ పేపరు చదువుతరు, మధ్యానం తిన్నాక బామ్మా పేపరు చదువుతది, పడుకునే ముందు అమ్మా పేపరు చదువుతది. మరీ!" "నేను చద్వాలిగా మరీ, అందుకు" అంటూ పేపరులోకి దూరిపోయింది. అర్ధం అయ్యీ కానీ భావంతో, తెలిసి తెలియని భాషతో మొదలెట్టేసింది చదవడం.
ట్రింగ్.. ట్రింగ్.. అంటు ఇంతలో ఫోన్ రింగ్ కావడంతో ఎత్తడానికి వాళ్ల నాన్న, పేపరు ఇచ్చేటట్టు లేదనీ తడబడుతూ భావాన్ని కూనీ చేస్తూ వార్తలు చదువుతున్న తన మనవరాలి పక్కన తాత, ఇంటి బండి ఇంధనమయిన ఒంట కోసం ఒంటింటి తలుపులు తట్టిన్రు ఆ ఇద్దరు ఇల్లాల్లు. రోజూ వారి కార్యాలను ఇలా ఆరంభించిన్రు క్లిష్టమైనా.. చిరునవ్వుతో.
(To be continued)
-భావన

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)