For my Pedhanana!
నీ ముఖం నేను చూడలేదు
కానీ, నీ కనుల మెరుపు నాకెప్పుడూ అగుపడ్తుంటది
నూ మాట్లాడుతుంటే వినలేదు
కానీ, నీ గొంతుక పాడిన ఆ విప్లవ గానం నా చెవిలో ఎప్పుడు ధ్వనిస్తూనేవుంటది
నూ చెప్పే కథలూ వినలేదు
కానీ, నీ కథనే వింటూ సాగినా
నూ మాట్లాడిన మాటలు, ప్రజల కోసం ఎత్తిన ఎర్రని జెండా
నీ దేహాన్ని ఎరుపుగా మార్చిన తూటా
రక్తంతో తడిసిన ఈ నేల
మోగించింది ధిక్కార స్వరం ఆ (సభల) రోజు
వేల నినాదాలలో వినిపించింది నీ వాదం
కాగడాల వెలుగు చూపించింది నీ క్రాంతి
నూ ఎత్తిన ఎర్రని జెండా కనిపించింది వేల జెండాలుగా రెపరెపలాడుతూ
ప్రతి ఏటా ఈ రోజు నీకై చేసే నినాదం
నీ జీవనకాంక్షకై మే చేసే శపథం:
అమరుడా!
నీ మాటా మరువలేం
... బాటా మరువలేం
నూ ఎత్తిన ఎర్రటి జెండా ఎన్నటికీ దించలేం
--భావన
20.05.15
Comments
Post a Comment