Posts

బంధాలు-భావాలు

బంధాలు భావాలను ఏర్పరుస్తయ్ భావాలు భాషలకు ప్రాణం పోస్తయ్ కానీ, భాష వక్రీకరించినప్పుడే బంధాలు వంకరైపోతయి ఒకరి భావోద్వేగాలు అందనప్పుడే భాష్యం పగిలిన అద్దమైపోతది! ~భావన

#‎NirbhayaCase‬

నీ నరం లేని నాలుకను కాదురా ఇంకా గళం ఇప్పని ఆ గొంతులను వధించాలి నీ గుండె చప్పుడు ఆపడం కాదురా ఇంకా ఇట్లాంటి ఊహలకు ప్రేరణిస్తున్న ఆ విశ్వసనీయులను హతమొందించాలి --భావన ‪#‎NirbhayaInsulted‬ ‪#‎IndiasDaughter‬ ‪#‎NirbhayaCase‬

అనుభవం

ఎదురుపడ్డ ఓ చేదు అనుభవం మార్చింది నా జీవన విధానం ఇగ అడగొద్దు ఎటని నా పయనం -- భావన

ఏమి వెతకను

ఏమి వెతకను నేను ఫ్రీవే ల ఫ్రీడం ఇచ్చిన నా గల్లీలను వెతకనా నాలుగు గిర్రల కారులోన నలుగు లక్షల కిలోమీటర్లు తిప్పిన నా ద్విచక్రాన్ని వెతకనా ఏమి తోచని ఖాలీ సమయాన అసలు ఖాలీ లెకుండా చేసిన నా నెస్తాలను వెతకనా ఇక్కడ కనిపిచ్చిన ప్రతీ చెట్టు లోన మా ఎన్ న్నా రై చెట్టు ని వెతకనా నే వేసె రెండు అడుగులలో నాతో నడిచిన ఆ ఇరవై అడుగులను వెతకనా రోజూ మోగే అలర్మ్ లొ నాన పిలుపు కోసమై ఆగే ఆ క్షనాన్ని వెతకనా సెల్ఫీలు తీసుకుని చూసుకునే సమయాన అమ్మనాన్న కనులే నా అద్దమైన నిమిషాలు వెతకనా ఏమీ తోచని క్షనాన చిన్నొడితో ఆడె జగడాలె వెతకనా ప్రతీ పార్టీలో మీతో కలిసి షికార్లు చేసిన గడియలు వెతకనా నిదుర రాని నాడు మీ పక్కకొచ్చి గప్పీలు కొట్టె లాలనను వెతకనా సాయంత్రాన అలసి సోఫా లో కూర్చున్న నాడు ననతో ఆ సయంత్రపు వేల వీదులలొ చెక్కర్లను వెతకనా కంప్యూటర్ లాబులో బాత్కాని కొడ్తునప్పుదు మన సంపంగి చెట్ల కింద సంభాషనను వెతకనా ఏమి వెతకను సాగించే జీవితాన జీవం ఎక్కడ వెతకను --భావన 28.01.15

ప్రయాణం

అది ఒక పల్లెటూరు పక్కనున్న ఓ చిన్న పట్టణము. గజిబిజిగా, గంభీరంగా ఉండే ప్రదేశం అది. అటొక మెట్రోపొలిటెన్ సిటీకి, ఇటు పల్లేటూరుకు మధ్యనుండే ప్రాచుర్యం పొందుతున్న ఓ చారిత్రక నగరం. కనుమరుగవుతున్న పల్లెటూరు తత్త్వానికి, అతి చేరువలోవున్నా పూర్తిగా ఆవహించుకోని నాగరికత మధ్యలో జీవిస్తున్న ఆశావాహిత జీవితాలు. వారిలో ఒకరితో ఈ ప్రయాణం... సూరీడు తన కాంతులను వెదజల్లకముందే తన చూపులతో ఈ లోకాన్ని స్వాగతిస్తూ తన ఇంటి ద్వారాన్ని తెరుస్తూ నడక ప్రారంభించాడు పొడుగాటి, బకపలుచని తాత, తన జీవిత అనుభవాల బరువుతో. అయినా దరి రాడే ఈ సూరీడు?? ఆ పాప చిరునవ్వుల కాంతి వెదజల్లకుండానే ఏల సూరీడు. అగొ, అదిగో చెవులు, కనులు రెండూ ఒక్క సారే తెరలేపినయి జీవన క్రాంతి వెతుకులాటని ఆ ఇంటిలొ. అటు, ఇటు గెంతులేస్తూ, అందరిని ఆగం చేసి లేపి, తన చిన్నరి పాదాలతో ఈ భువిని పలకరిస్తూ పులకింపజేస్తు తన కలనే వెంటాడుతున్న అన్నంత వేగంతో తడబడుతూ, ముందుకెళ్తూ దూసుకుపోతుంది తన గది నుంచి మరో గదిలోకి. బెడ్ పైకి ఎక్కి భామ్మ అంటూ మోము పై చిట్టి చేతులను రాల్చి లేపబోయి పడుకున్న ప్రశాంతతను చూసి ఆగిపోయింది. మెల్లిగా అవ్వ భుజాన తలబెట్టి మళ్లీ ఆహ్వానించింది అందరి...

On Panthankot Attack

పసి మొగ్గలను తుంచేస్తే ఏలరా? పూ తోటలు ఎలా పూయును మానవత్వ పరిమలం ఎలా పర్వసించును ఈ భువి పై??? #‎FightAgainstTerrorism‬

reminiscing bhamma (Grand Ma)

కదలాడే కలవైనా కదలలేని శిలవైనా నీ తోడు నాకై ఉండె కడదాక జీవించు నీవు నా శ్వాస తుది దాక Nov 23,2014 =============================================== ఈ నిశబ్ద సందర్భాన్ని అహ్వానిస్తాననుకోలేదు ఎన్నడు!!! Dec 2,2014 =============================================== ఓ కాలమా ఎటుపోతివే నా జాడలే కానరానియ్యక Dec 7,2015 ================================================ తప్పిపోయిన ప్ర్రాయం.. వెనక్కి వచ్చి.. తెచ్చి ఇచ్చేనా ప్రాణం! Dec 13,2014 ================================================ కన్న పేగుకి కాసంత దూరాన ఉన్న కూనా ఎందుకమ్మా నీకింత ప్రేమ!! Dec 15, 2014 ================================================