Posts

Showing posts from 2010

ఎందుకు?

మనిషిగా పుట్టినందుకు అదీ ఓ ఆడపిల్లగా పుట్టినందుకు ఆ ఆడపిల్ల తండ్రి ఎవరైనా లెఫ్టిస్ట్ నుంచి సామ్రాజ్యవాదిగా మారాలా? కమ్మ్యునిస్ట్ నుంచి కాపిటలిస్ట్గా మారాలా? సంఘసంస్కర్త సంఘాన్ని ద్వేషించాలా? చిన్నతనంలో ధైర్యంగ ఎదురొడ్డిన గుణం తండ్రయ్యాక పిరికివాడిలా మారాలా? చావునే ఎదురించిన బతుకు చస్తూ బ్రతకాల?? ఎందుకు? ఎవరు కారణం? ఈ సమాజమా?? లేక ఆ తండ్రి నిస్సహాయతా?

కృంగమాకు

నిన్నెవరైనా ఎదుర్కొన్ననాడు  ప్రశ్నించిన నాడు నిన్ను దూషించిన నాడు  నీ మీద క్రోధాన్ని పెంచుకున్ననాడు నిన్ను వ్యతిరేకించిన నాడు నూ వ్యర్ధం అన్ననాడు కృంగమాకు ఆలోచించు! ఆ మాటలకు అర్ధాలు వెతికిచూడు వారి భావాలు గమనించు వారి గమ్యాలను ఊహించు నీ ఆలొచనలకు ఓ ఆచరణ దొరుకుతుంది జీవనం అనే మాధుర్యం చేరువవుతుంది.. 

మనిషి గొప్ప

సముద్రపు వ్యూహం తీరాన్ని చేరడం తీరం చేరిన ప్రతి అలను చూసిన మనం అందమెంతో ఉందనుకుంటం   నిశ్చలంగా, నిశ్శబ్దంగా, సున్నితంగ తాకుతుంది హ! ఎంత అందం! అనే ఆశ్చర్యం  అందాన్ని చూసి మురుసిపోతం కానీ, ఒక్కసారి, ఒకేఒక్క సారి దరి చేరు దాని లోకంలొ విహరించు, దాని భావాలలొ ప్రవహించు. తెలుస్తుంది.. అప్పుడు తెలుస్తది... అలల అలజడి తీరం చేరాలని ఆశతో  ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడు అది వినిపించే ఆవేదన దూరం నుంచి వినిపించిన నిశ్శబ్దం  ఎంత ధ్వనిస్తుందో  దూరం నుంచి కనపడిన నిర్మలత్వం ఎంత కఠినమవుతుందో ఎంతో సున్నితంగ కనిపించిన దూరం, దరి చేరేసరికి రాతిని ప్రతిబింబిస్తుందో   ఇంత ఉన్నా అది తీరం చేరుతుంది మనల్ని చేరుస్తుంది సురక్షితంగా చేరినాక అలసిసొలసిన ఆ అలలను చూడు తీరం చేరాలన్న మదిని తీర్ధం చేస్తుంది దూరపు కొండలు ఎప్పుడయ్న నునుపే అన్నదానికి నిర్వచనం చెబుతుంది ప్రతి జీవన పోరాటం నేర్పిస్తుంది   అప్పుడు అందం కాదు గొప్పతనం కనిపిస్తుంది  ప్రతి మనిషి జీవితం ఈ అలతో ముడిపడిందే. ఒక మనిషికి చేరువ అయ్యి తెలుసుకున్న తరువాతే అంచనా వెయ్యి. ఆ...

అంతరార్ధం???

అందాల ముళ్ల బాటలో  ఆత్మీయత ఎంతున్నా ఆనందాల పర్వంలో ఒడిదుడుకులు ఎదుర్కున్నా ఓటమి ధక్కుతున్న ఓపికతో వేచియుంటే ఓ చిన్న అనంతమయిన  భగవంతునిలో అంతరార్ధం నీవే కన్నా....

ఉషాకిరణమా!

ఉషాకిరణమా! ఉషోదయానికల్లా నూ ఓ ఉషస్సు నై  ఉద్బవించాలని ఉరకలేసినావా? ఎవరికి తెలియజేయకుండా మౄత్యువు కోసం శిక్షణకెల్లినావా? పిల్లల చిరునవ్వే నీ మనస్సుని చిగురిస్తుందని వారి మాటలే నీ ఉల్లాసమని వారితో ఆటలే నీ ఆనందమని  నేటి విద్యార్తుల భవిష్యత్తే రెపటి సమాజపు నిర్మాణాలు అని తలిచిన నువ్వు ఆ భవిత కోసమె కదా పయనం చాలిస్తివి  నీ నమ్మకమే నిన్ను కడతేర్చింది కదా  ఏ పాపము చేసావని నీవు? ఆ సూర్య అగ్నికి ఆహుతిచేసాడు నిన్ను? తనలో ఉశస్సు తగ్గిందనా?? లేక నూ చేరితే ఉషస్సు ఉజ్వలిస్తుందనా??  (will miss you Tanuja Aunty & will never forget the injustice to you. will fight for it)

ఆశ కోసం...

ఆశ కోసం... అందమెంతో ఉందనుకున్నా అనర్దమైన జీవితంలో ఆటంకాలెన్ని ఎదురొచ్చినా  ఆటలే అన్నీ అని ఆకర్షితమయ్యా ఇక్కట్లే ఎన్ని వచ్చినా  ఇష్టంగా తలొగ్గిన..తలెత్తినా..ఎదురొడ్డినా... విమర్శలే ఎన్ని చేసినా సున్నితమైన నా మనసు తట్టుకోలేదని తెలిసినా ప్రేమ అనే కొవ్వత్తిని ఏనాటికైనా వెలిగించాలని  అనుబంధమనేది ఆచరనే అవ్వాలని  ఆప్యాయతలు ఆపద్భాంధవుడై తోడు నిలవాలని  గాయాలను గుండెలోనే దాచి నా ఆశయానికి ఆశనే మందుగా ఇస్తూ ఇలా వేధాంత విధానాలుగ నిలుస్తున్న మనుషుల మనసుల మార్పు కోసం వేచిచుస్తూ  ఆశల కిరణాల కోసం జీవిస్తున్నా...

ఓ ప్రశ్నార్ధకం

మనుషుల మనసులు తెలిపే ఊసులే రావే  మనసుల మర్మము తెలిపే అర్దమే గోచరించదే  ఇలా, అలా, ఎలా అని ప్రశ్నించే నా మనసుకు ఈ ఇలలో అలలా నా జీవితం సాగుతుంది ప్రశ్నించే హక్కు ఏర్పరిచినా  జవాబు రాని ప్రశ్నను ప్రశ్నించడం    మిగిలేనే ప్రశ్నార్ధకం  ???