Posts

Showing posts from 2013

తెలంగాణం

భూమి, నీరు నా పంటా చేను బొగ్గు  బావి అయినా కరెంటు కోత టెక్స్టైల్సు,మిల్సు అన్నీ కూల్చివేత ఏర్ఫీల్డు పోర్టుగా మారని తలరాత డిగ్రీలు, పి.జి. లు అని ఎన్నీ చద్వినా కూటికి,పూటకి దిక్కే లేదురా తెలుగు భాషా ఒకటే అంటున్నా మా యాసా ఘోష ఎవరికి ఎక్కేనురా.. అరవయ్ ఏళ్ల బానిసత్వం వాక్కు హక్కు లాఠీ మింగినా కేసులు,షీట్లు, ఎన్నో నింపినా రక్తపు బొట్టు నేలే రాలినా  కన్న ప్రాణాలు కొట్టుకు పోయినా  కసాయిధారులు రాజ్యమేలినా  నినాదపు గొంతులు నిమిరేసినా.. స్వరమవ్వురా.... నువూ,నేను అన్నాదమ్ములంటా  విడిపోతే ఇద్దరం సమతుల్యమంటా ||2|| కలిసుండి ఎవరికి నోచని భాగ్యమే ఎందుకురా  విడిపోయి సమైక్యంగ అభివృద్ది నిచ్చనే ఎక్కేమురా నువ్వు,నేను అంతా సహోదరులేరా..

నా డైరీ..

ఇది కలలో నిదురించేది కాదు కవితలు స్రిష్టించేది కూడా.. కలం యొక్క పట్టువిడుపే కాదూ కళ యొక్క సంత్రుప్తి కూడా.. ఇది మాటల పలకరింపులే కాదూ నా మనసు యొక్క ప్రతిబింబం కూడా.. ఇక్కడ మాటల గారడీయే కాదూ మనసులు ఏర్పర్చిన పేరడీ కూడా.. ఇది డైరీ యే కాదూ నా భావోద్వేగాల కలయిక కూడా... నా కలల అన్వేషణ కూడా న మనసుని ఉరికిస్తున్న నా జీవితం కూడా... 

మన భారతదేశం.....

భారతదేశపు ఘన చరిత్ర గగనానికి చేరినా..గాలిలా విస్తరించినా చరిత్ర ఎన్నో వాస్తవాలు భోదించినా.. దైవ ఘటన ప్రాప్తో ఎమో గానీ మారిందె.. మార్పుకు గురయందీ మనుష్యుల హ్రుదయాలు, మనసుల స్వభావం కాదు.. చదివినా..చదవకపొయినా.. ఆకరికి కంగుతిన్నది మానవత్వము.. ఎది ఏమైన..    దిగజారిన ఆలొచనా శక్తే  నవ భారతపు నిజ స్వరూపం.. 

ఓ ప్రజానాయకులారా!!!

అన్యాయానికి ప్రతిరూపమా అవినీతికి మారుపేరా ఓ ప్రజానాయకులారా!!! ప్రజల వలన ప్రజల కొరకూ ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పాలకులార ప్రజల కష్టాన్ని ధగాచేయమని.. ప్రజల రక్తాన్ని దోచుకోమని ఉన్నత్తంగ ఉన్మాదానికి పాలుపడమన్నదా?? నీ ఈ ప్రజాస్వామ్యం తన న్యాయ కోరిక తీరుతుందెమో అని తన కలల స్వప్నం చుస్తానేమో అని ఓటు వేసిన ప్రజలకు మిగిల్చెది మట్టి చెతులు,ఎండమావులేనా.. కర్షకులకు..కార్మికులకు కడతేల్చిన కర్మాగారాలు రైతన్నలకు,నేతన్నలకు చూపించే ఉరితాళ్లు చిన్నూలకు,నవతరాలకు మిగిల్చిన కాలీ కదుపులా??? ప్రమానం ఏమో ప్రజలకొసం ప్రయానమేమో మీ బాంకు ఖత కొసం.. ఏమి మీ అంతర్మథనం ఎందుకు మాకీ ఆక్రోషం!

ఆవేదనాలి

మే నవమాసాలు మోసీ కనే తల్లిమైనా  ఆ పేగు బంధాన్ని మరిచి,మెడపై చుట్టుకున్న మృగాలై మీరు మారినా ఒక ఆలినై మీ జీవితాన్నే మట్టు కరుపుంచేల కౄరులుగా మీరు మారినా ఒక అక్కగా,చెల్లిగా ఎల్లప్పుడు మీ అండగా నిలుస్తామని శపదం చేసినా  అది శాపమై మము నిలువెల్లా చీల్చినా భూమికి దిగివచిన తారలము మేమైనా  ఒక తారగా ఆకాశ శూన్యంలోకి పంపాలని మీరు ప్రయత్నము చేయదల్చినా నూ గుక్కుపెట్టుకుని ఏడుస్తున్న సమయాన  మా ఎద పై మిమ్ము లాలించినా ఆ ఎదలోతుల్లో దాగున్న గుండె చప్పుడిని ఆపాలని మీరు ప్రయత్నిచంచినా ఆకలితో అలమడిస్తున్నప్పుడు మా అవయవాలు కరిగించి మీకు పాలు తాగించినా.. ఆ అవయాల్నే తునతునకలు మీరు చేసినా మే పాడే జోలపాట మిము నిద్రపుచడానికైనా మము శాశ్వత నిద్రలోకి పంపాలని మీకు దురహంకారమున్నా మే పసిముగ్గల్లా మిము లాలించినా క్రూర మృగములా మా పై హత్యాచారానికి మీరు ఎగపడినా మీ మోములొని చిరునవ్వు కోసం ఎల్లవేలలా మే శ్రమించినా మా మోము జాడే తేలికుండా చేయాలనే మీది రాక్షస ప్రయత్నమైనా మీరు తప్పటదుగులు వేస్తున్న సమయాన వేలు పట్టుకుని నడిపించింది మేమైనా చెడు దారిలో నడిచి ఆ చేయినే లాగి ...