మనిషి గొప్ప

సముద్రపు వ్యూహం తీరాన్ని చేరడం
తీరం చేరిన ప్రతి అలను చూసిన మనం
అందమెంతో ఉందనుకుంటం  
నిశ్చలంగా, నిశ్శబ్దంగా, సున్నితంగ తాకుతుంది
హ! ఎంత అందం! అనే ఆశ్చర్యం 
అందాన్ని చూసి మురుసిపోతం
కానీ,
ఒక్కసారి, ఒకేఒక్క సారి దరి చేరు
దాని లోకంలొ విహరించు, దాని భావాలలొ ప్రవహించు.
తెలుస్తుంది..
అప్పుడు తెలుస్తది... అలల అలజడి
తీరం చేరాలని ఆశతో 
ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడు
అది వినిపించే ఆవేదన
దూరం నుంచి వినిపించిన నిశ్శబ్దం  ఎంత ధ్వనిస్తుందో 
దూరం నుంచి కనపడిన నిర్మలత్వం ఎంత కఠినమవుతుందో
ఎంతో సున్నితంగ కనిపించిన దూరం,
దరి చేరేసరికి రాతిని ప్రతిబింబిస్తుందో  
ఇంత ఉన్నా అది తీరం చేరుతుంది
మనల్ని చేరుస్తుంది సురక్షితంగా
చేరినాక అలసిసొలసిన ఆ అలలను చూడు
తీరం చేరాలన్న మదిని తీర్ధం చేస్తుంది
దూరపు కొండలు ఎప్పుడయ్న నునుపే అన్నదానికి నిర్వచనం చెబుతుంది
ప్రతి జీవన పోరాటం నేర్పిస్తుంది  
అప్పుడు అందం కాదు గొప్పతనం కనిపిస్తుంది 

ప్రతి మనిషి జీవితం ఈ అలతో ముడిపడిందే. ఒక మనిషికి చేరువ అయ్యి తెలుసుకున్న తరువాతే అంచనా వెయ్యి. ఆ మనిషి ఎంత గొప్పవాడో అర్ధమవుతుంది.

 నోట్:     గొప్పతనం అంటే పేరు, ప్రఖ్యాతలు, డబ్బు ఉన్నవాడు కాడు. తన జీవితానికి జీవం పోసి జీవనాన్ని కొనసాగించే ప్రతి మనిషి గొప్పవాడే.

Comments

Post a Comment

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)