Posts

కానీ!!!

భారతదేశాన్ని ప్రేమిస్తారట కానీ దాన్ని సమ్రక్షించే రాజ్యాంగాన్ని గౌరవించరట మతాన్ని హక్కున చేర్చుకుంటారట కానీ అది భోదించే భావాలను పాటించరట సమాజ హితవు కోరుకుంటారట కానీ తమ భాద్యతలను కచ్చితంగ నిర్వర్తించరట ఎదుటి వారినుంచి గౌరవం ఆశిస్తారట కానీ ఎదుతి వాల గౌరవాన్ని కించపరుచొచ్చట సమానత్వం గురుంచి బోధించొచ్చట కానీ దాన్నీ పాటించొదట ఇంకా చెప్పుకుంటూ పోతే        అన్నీ మనకే కానీ ఏవి మనవి కావు!!!

నా జీవనం!

నా జీవనం నే సాగే పయనం అది అందరి కలయిక చేదు, తీపి, కారం, పులుపు ఉగాది పచ్చడి లాగె అదీ సమాహారం సంతోషం, దు:ఖం అవే నేస్తాలు ఎన్నో ఒడిదుడుకులు.. అన్నీ ఆనందమే  ఎన్నో ఎదురుగాలులు అన్నీ నిబ్బరాన్ని నింపినవే సూర్యచంద్రుల ప్రతిబింబం ఇదే నా జీవితం నే సాగే ప్రయాణం

అన్నా!

కోట్లాది మంది ప్రాణుల విలువల కోసం  పయనించి, ప్రవహించి అలసిసొలసితివా అన్నా! ఈ భూతల్లి కోసం నీ ప్రాణాలను పనంగా పెట్టినా ఓ మాతాపుత్రుడా! ఉద్యమమే ఊపిరిగా బ్రతికిన నిన్ను అస్తమింపజేసినా పాపం! తెలియదేమో ఆ రాక్షస పాలకులకు, నీ ఊపిరి మాకందించి ఒక వేగుచుక్కవై నిలువడానికి  మాకు దూరంగా వెళ్లావని... నీ పాదాల జాడలు మాసిపోతాయా ఏనాటికయ్న?? వెర్రివాళ్లు కానీ.. ఓ ఉద్యమ సూరీడా!        నువ్వు వెదజల్లే ఆ సూర్యకిరణాల తోవలోనే మేము పయనిస్తామని ఈ ప్రతీన.. 

తెలంగాణ ఉద్యమం...

తెలంగాణ ఉద్యమం... ప్రతి వాది రక్తపు బొట్టులోప్రవహించే నాదం ఇది ప్రతి వాది గొంతుక పుటల్లొ దాగివున్న విప్లవ గీతం ఇది ప్రతి హ్రుదయపు అంచుల్లో నాటుకున్న ఉజ్వల భవిష్యత్తు ఇది ప్రతి ఊహల్లో ఉనికిసలాడే వీరోచ్చిత ఘట్టం ఇది అరవై ఏళ్లు;స్వాతంత్ర్య పోరాటాన్ని మించిన గాద ఇది బిగిసిన ప్రతి పిడికిలి యొక్క శిఖరాగ్న జ్వాల ఇది

ఎందుకు?

మనిషిగా పుట్టినందుకు అదీ ఓ ఆడపిల్లగా పుట్టినందుకు ఆ ఆడపిల్ల తండ్రి ఎవరైనా లెఫ్టిస్ట్ నుంచి సామ్రాజ్యవాదిగా మారాలా? కమ్మ్యునిస్ట్ నుంచి కాపిటలిస్ట్గా మారాలా? సంఘసంస్కర్త సంఘాన్ని ద్వేషించాలా? చిన్నతనంలో ధైర్యంగ ఎదురొడ్డిన గుణం తండ్రయ్యాక పిరికివాడిలా మారాలా? చావునే ఎదురించిన బతుకు చస్తూ బ్రతకాల?? ఎందుకు? ఎవరు కారణం? ఈ సమాజమా?? లేక ఆ తండ్రి నిస్సహాయతా?

కృంగమాకు

నిన్నెవరైనా ఎదుర్కొన్ననాడు  ప్రశ్నించిన నాడు నిన్ను దూషించిన నాడు  నీ మీద క్రోధాన్ని పెంచుకున్ననాడు నిన్ను వ్యతిరేకించిన నాడు నూ వ్యర్ధం అన్ననాడు కృంగమాకు ఆలోచించు! ఆ మాటలకు అర్ధాలు వెతికిచూడు వారి భావాలు గమనించు వారి గమ్యాలను ఊహించు నీ ఆలొచనలకు ఓ ఆచరణ దొరుకుతుంది జీవనం అనే మాధుర్యం చేరువవుతుంది.. 

మనిషి గొప్ప

సముద్రపు వ్యూహం తీరాన్ని చేరడం తీరం చేరిన ప్రతి అలను చూసిన మనం అందమెంతో ఉందనుకుంటం   నిశ్చలంగా, నిశ్శబ్దంగా, సున్నితంగ తాకుతుంది హ! ఎంత అందం! అనే ఆశ్చర్యం  అందాన్ని చూసి మురుసిపోతం కానీ, ఒక్కసారి, ఒకేఒక్క సారి దరి చేరు దాని లోకంలొ విహరించు, దాని భావాలలొ ప్రవహించు. తెలుస్తుంది.. అప్పుడు తెలుస్తది... అలల అలజడి తీరం చేరాలని ఆశతో  ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పుడు అది వినిపించే ఆవేదన దూరం నుంచి వినిపించిన నిశ్శబ్దం  ఎంత ధ్వనిస్తుందో  దూరం నుంచి కనపడిన నిర్మలత్వం ఎంత కఠినమవుతుందో ఎంతో సున్నితంగ కనిపించిన దూరం, దరి చేరేసరికి రాతిని ప్రతిబింబిస్తుందో   ఇంత ఉన్నా అది తీరం చేరుతుంది మనల్ని చేరుస్తుంది సురక్షితంగా చేరినాక అలసిసొలసిన ఆ అలలను చూడు తీరం చేరాలన్న మదిని తీర్ధం చేస్తుంది దూరపు కొండలు ఎప్పుడయ్న నునుపే అన్నదానికి నిర్వచనం చెబుతుంది ప్రతి జీవన పోరాటం నేర్పిస్తుంది   అప్పుడు అందం కాదు గొప్పతనం కనిపిస్తుంది  ప్రతి మనిషి జీవితం ఈ అలతో ముడిపడిందే. ఒక మనిషికి చేరువ అయ్యి తెలుసుకున్న తరువాతే అంచనా వెయ్యి. ఆ...