Posts

For Vivek

తమ్ముడా! రక్కసు కక్కే రాబందుల పాలిట రణ నినాదాన్ని మోగించిన వీరుడా! జన సర్కారే నా సర్కారని ఉద్యమించిన యోదుడా! వికాసాన్ని విరజల్ల విప్లవ నినాదం అందుకున్న అమరుడా! నేల రాలిన వివేకుడా తెలీదేమో పాపం ఈ చెడ్డ రాజ్యానికి నూ వేల కిరణాల్లా విజృంభిస్తూ మల్లా వస్తావని తెలీదేమో పాపం ఈ సామ్రాజ్యవాద లుచ్చాకోర్లకి నీ రక్తపు బొట్టుతో తడిసిన ఈ నేల తల్లి పలు రెట్లు ప్రకాశించు ఎర్రని జెండాలా రెపరెపలాడుతూ ఉంటదని ~భావన 13.06.2015

For my Pedhanana!

నీ ముఖం నేను చూడలేదు కానీ, నీ కనుల మెరుపు నాకెప్పుడూ అగుపడ్తుంటది నూ మాట్లాడుతుంటే వినలేదు కానీ, నీ గొంతుక పాడిన ఆ విప్లవ గానం నా చెవిలో ఎప్పుడు ధ్వనిస్తూనేవుంటది నూ చెప్పే కథలూ వినలేదు కానీ, నీ కథనే వింటూ సాగినా నూ మాట్లాడిన మాటలు, ప్రజల కోసం ఎత్తిన ఎర్రని జెండా నీ దేహాన్ని ఎరుపుగా మార్చిన తూటా రక్తంతో తడిసిన ఈ నేల మోగించింది ధిక్కార స్వరం ఆ (సభల) రోజు వేల నినాదాలలో వినిపించింది నీ వాదం కాగడాల వెలుగు చూపించింది నీ క్రాంతి నూ ఎత్తిన ఎర్రని జెండా కనిపించింది వేల జెండాలుగా రెపరెపలాడుతూ ప్రతి ఏటా ఈ రోజు నీకై చేసే నినాదం నీ జీవనకాంక్షకై మే చేసే శపథం: అమరుడా! నీ మాటా మరువలేం ... బాటా మరువలేం నూ ఎత్తిన ఎర్రటి జెండా ఎన్నటికీ దించలేం --భావన 20.05.15

ఈ గాలి

వీస్తున్న ఈ చల్లటి గాలి నీ స్పర్శని అందిస్తున్నదేమో పచ్చటి ఈ ఆకులు శృతిని అందుకున్నయి! పూలేమో నవ్వుల రాగాలు ఆలపిస్తున్నయి!!! గ్ణాపకలను నెమిరేస్తు నా మనసిలా పాటాలపిస్తుంది!!! ~భావన

బంధాలు-భావాలు

బంధాలు భావాలను ఏర్పరుస్తయ్ భావాలు భాషలకు ప్రాణం పోస్తయ్ కానీ, భాష వక్రీకరించినప్పుడే బంధాలు వంకరైపోతయి ఒకరి భావోద్వేగాలు అందనప్పుడే భాష్యం పగిలిన అద్దమైపోతది! ~భావన

#‎NirbhayaCase‬

నీ నరం లేని నాలుకను కాదురా ఇంకా గళం ఇప్పని ఆ గొంతులను వధించాలి నీ గుండె చప్పుడు ఆపడం కాదురా ఇంకా ఇట్లాంటి ఊహలకు ప్రేరణిస్తున్న ఆ విశ్వసనీయులను హతమొందించాలి --భావన ‪#‎NirbhayaInsulted‬ ‪#‎IndiasDaughter‬ ‪#‎NirbhayaCase‬

అనుభవం

ఎదురుపడ్డ ఓ చేదు అనుభవం మార్చింది నా జీవన విధానం ఇగ అడగొద్దు ఎటని నా పయనం -- భావన

ఏమి వెతకను

ఏమి వెతకను నేను ఫ్రీవే ల ఫ్రీడం ఇచ్చిన నా గల్లీలను వెతకనా నాలుగు గిర్రల కారులోన నలుగు లక్షల కిలోమీటర్లు తిప్పిన నా ద్విచక్రాన్ని వెతకనా ఏమి తోచని ఖాలీ సమయాన అసలు ఖాలీ లెకుండా చేసిన నా నెస్తాలను వెతకనా ఇక్కడ కనిపిచ్చిన ప్రతీ చెట్టు లోన మా ఎన్ న్నా రై చెట్టు ని వెతకనా నే వేసె రెండు అడుగులలో నాతో నడిచిన ఆ ఇరవై అడుగులను వెతకనా రోజూ మోగే అలర్మ్ లొ నాన పిలుపు కోసమై ఆగే ఆ క్షనాన్ని వెతకనా సెల్ఫీలు తీసుకుని చూసుకునే సమయాన అమ్మనాన్న కనులే నా అద్దమైన నిమిషాలు వెతకనా ఏమీ తోచని క్షనాన చిన్నొడితో ఆడె జగడాలె వెతకనా ప్రతీ పార్టీలో మీతో కలిసి షికార్లు చేసిన గడియలు వెతకనా నిదుర రాని నాడు మీ పక్కకొచ్చి గప్పీలు కొట్టె లాలనను వెతకనా సాయంత్రాన అలసి సోఫా లో కూర్చున్న నాడు ననతో ఆ సయంత్రపు వేల వీదులలొ చెక్కర్లను వెతకనా కంప్యూటర్ లాబులో బాత్కాని కొడ్తునప్పుదు మన సంపంగి చెట్ల కింద సంభాషనను వెతకనా ఏమి వెతకను సాగించే జీవితాన జీవం ఎక్కడ వెతకను --భావన 28.01.15