Posts

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను

ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను తెగి పడిన తల, నాలాగే బతుకెతుక్కుంటున్న బాటసారిదే కాని నాది కాదనా? మూగబోయిన గాత్రం, నన్ను ప్రేరేపించిన గళానిదే కాని నాది కాదనా? మసైపోయిన తనువు, చీకటిని జయించ వచ్చిన కాగడాలదే కాని నాది కాదనా? చిందిన రక్తం, అయిన గాయం, నాకోసం ఎదురొడ్డిన వాల్లదే కాని నాది కాదనా? సంకెళ్లతో బంధించబడ్డ సత్యం చెరసాలలో నిందింపబడ్డ న్యాయం, నాకోసం పిడికిళెత్తిన వాళ్లదే కాని నాది కాదనా? జీవచ్చవమయ్నా సరే, జీవితం సాగించాలనుకుంటున్న నాకు ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను . . నీకై చూపిచ్చి! ~భావన

ఈరోజు నిన్నేగా

నేను నిన్నటినేగా ఈరోజు నిన్న వల్లేగా ఈరోజటితో ఎంత అనుబంధమో నిన్నటితో అంత కంటే ఎక్కువ ప్రేమ ఎందుకంటే ఈరోజు నిన్నవల్లేగా ఎన్నటికయినా ఎప్పటి రేపటికయినా ఈరోజు నిన్నేగా ~భావన

Telugu Quotes from me (Updated)

ప్రేమ నీది నేను పంచుతున్నానంతే! 29th December 2017 ======================================================================== ఆనందానికి అరాచకత్వానికి తేడా తెలియకుండ పెరుగుతుంది ఈ సమాజం కానీ సమాజం నువ్వూ నేనూ తోనే మొదలు నువ్వూ నేనూ తోనే అంతం కదా... 14th October 2017 ======================================================================== నైజామోడి కాలం చెల్లించినా.. దొరల పాలన మట్టిల కలిసినా.. ఆంధ్ర పాలకుల ఆధిపత్య అంతు చూసినా ఇంకా ఇంకా పోరటాలే కావల్సొస్తుందంటే తప్పు మట్టున పెట్టినా పైకి లేస్తున్న దొరల అరాచకానిదా లేక ఇన్ని పోరాటాలు చేసి మన బానిసత్వాన్ని కూడా మట్టిన కలిపినా మళ్లా మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టే మనదా? 21st June 2016 ======================================================================== కల నీదీ, నాదీ కాకుండా మనతో పాటు అందరిది అయినప్పుడే అది పోరాట రూప తెచుకుంటది.  అలాంటిది నీ కల ఓ పాలకుడి కలగా మాత్రమే తీర్చుకుంటా అంటే ఎట్ల? మల్లీ మొదలవ్వదా పోరాటం?? 21st June 2016 ===================================================================== గెలుపు కష్టపడినోడికే! క...

ప్రతీ క్షణం, మరో క్షణం

ప్రతీ క్షణం,మరో క్షణం ప్రతి అడుగు ప్రతి ఆలోచన... కొందరికి పుట్టుక, కొందరికి మరణం సాగించే జీవితంలో ఏదో సాధించ ప్రయాణం ఒకరికి విజయం, మిగిలిందంతా పరాజయం ఒకరి జీవితంలో మరొకరిని తోసే పయనం ఒకరి ఆలోచనలకు ఆనకట్టై మిగితా జనం జనసంధోహంలో మునిగి తేలుతున్న జీవన పరమార్ధం అది ఎవరికి తోచని తనకే తెలిసే అంతర్మధనం ఇది జీవి భూగోళం అర్ధం గోచరించని భాగోతం

For my Grand Ma! (When I returned from U.S)

నా చూపులు నీకై వెతుకుతున్నై నా గొంతుక నిన్ను పిలవాలని తపిస్తుంది నా చెవులు నీ పిలుపుకై వేచి చూస్తున్నై నా ప్రతి అడుగు నీ రూపంతో నిండిన గ్ణాపకాల నీడలో సేద తీరుతుంది కావొచ్చు అందరికి ఇది నీ యాడాది కాని నాకు, స్థిరత్వం కొల్పోయి యాడాదైన నా పునాది 29th november,2015 ===================================================================== కలల కోసం సాగనంపిన కనులలో తిరిగి రాగా ఎదురుచూసె కనులలో ఇంత తేడా ఎందుకనీ ఎదురుకాలేని ఆ చూపులకోసం ఈ వెతుకులాట ఎందుకనీ 12th november,2015 ===================================================================== రోజూ యాదికి తెచ్చుకోవాలని నా యాదే లేక సోయితప్పి యిడిశిపెట్టి పోతివి నా యాద్దాశ్కి నూ తప్ప ఇంకేం సోయికొస్తలేదని ఇప్పుడింక ఎవర్కి చెప్పాలె ఎట్ల చెప్పాలె?? 16th June, 2015 ~భావన

ఈనాటి సమాధి

ఆ కొబ్బరి నీళ్ల వెచ్చదనానికి ఆ నక్షత్రాల చల్లదనానికి కన్నీరు తూడ్చ వచ్చిన ఆప్యాయతకి అన్ని సమపాలు పంచ నేర్పిన అనుబంధానికి ఈనాటి ఈగో పేర్చెను సమాధి! ~భావన

For Sruthi!

Image
మీ రక్తంతో ఇంకా ఎరుపెక్కనీయకండి ఈ నేలని మా గుండెలోని రక్తపు బొట్టు ప్రవహించనంటోంది రాలిపోయిన ఈ అరుణతారలని చూసి 15 September, 2015 ======================================================================== నిశ్శబ్దమై నింగికెగిసిన ఓ జ్వాలా ఈ మూగమనసుల గొంతుక మరి ఏలా?? 17 September, 2015 ~భావన