బామ్మ!

బామ్మ!
పసి పాప లా లాలించిన నీ రూపం
కన్నీటికి బిందువై తోడైన నీ రూపం
నా చిరునవ్వుకు చిరునామ నీ రూపం
సుడిగుండపు జీవితాన తీరం నీ రూపం
అలసి సొలసిన వేల సేద తీర్చు నీ రూపం
చిన్ననాటి చందమామకథల నిలయం నీ రూపం
నే మొదలెట్టిన కవిత్వా సంపుటి నీ రూపం
నా అంతర్గత భావానికి భాష్యమయ్యె నీ రూపం
నా నవ్వులు పెంచు చిరునవ్వు నీ రూపం
నే ఓడిన క్షణాన ఓదార్పు నీ రూపం
నే గెల్చిన నాడు విజయభింభిక నీ రూపం
నా వెన్నుతట్టు ఆత్మస్థైర్యం నీ రూపం
నే కదలాడె స్వప్నాల ఆచూకి నీ రూపం
నా మనసుకి మమథ కి ప్రతిరూపం
అదృష్యమైతుందని తెల్సిన క్షణాన ఏమవు నా ప్రాణం
అంతు తోచలేదా ఏ ఒక్క క్షణం

Comments

Popular posts from this blog

తెర చాటు

ఈరోజు నిన్నేగా

Telugu Quotes from me (Updated)