తెలంగాణ ఉద్యమం... ప్రతి వాది రక్తపు బొట్టులోప్రవహించే నాదం ఇది ప్రతి వాది గొంతుక పుటల్లొ దాగివున్న విప్లవ గీతం ఇది ప్రతి హ్రుదయపు అంచుల్లో నాటుకున్న ఉజ్వల భవిష్యత్తు ఇది ప్రతి ఊహల్లో ఉనికిసలాడే వీరోచ్చిత ఘట్టం ఇది అరవై ఏళ్లు;స్వాతంత్ర్య పోరాటాన్ని మించిన గాద ఇది బిగిసిన ప్రతి పిడికిలి యొక్క శిఖరాగ్న జ్వాల ఇది
ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను తెగి పడిన తల, నాలాగే బతుకెతుక్కుంటున్న బాటసారిదే కాని నాది కాదనా? మూగబోయిన గాత్రం, నన్ను ప్రేరేపించిన గళానిదే కాని నాది కాదనా? మసైపోయిన తనువు, చీకటిని జయించ వచ్చిన కాగడాలదే కాని నాది కాదనా? చిందిన రక్తం, అయిన గాయం, నాకోసం ఎదురొడ్డిన వాల్లదే కాని నాది కాదనా? సంకెళ్లతో బంధించబడ్డ సత్యం చెరసాలలో నిందింపబడ్డ న్యాయం, నాకోసం పిడికిళెత్తిన వాళ్లదే కాని నాది కాదనా? జీవచ్చవమయ్నా సరే, జీవితం సాగించాలనుకుంటున్న నాకు ఎట్లని నచ్చచెప్పుకోమంటవు నన్ను . . నీకై చూపిచ్చి! ~భావన
ప్రేమ నీది నేను పంచుతున్నానంతే! 29th December 2017 ======================================================================== ఆనందానికి అరాచకత్వానికి తేడా తెలియకుండ పెరుగుతుంది ఈ సమాజం కానీ సమాజం నువ్వూ నేనూ తోనే మొదలు నువ్వూ నేనూ తోనే అంతం కదా... 14th October 2017 ======================================================================== నైజామోడి కాలం చెల్లించినా.. దొరల పాలన మట్టిల కలిసినా.. ఆంధ్ర పాలకుల ఆధిపత్య అంతు చూసినా ఇంకా ఇంకా పోరటాలే కావల్సొస్తుందంటే తప్పు మట్టున పెట్టినా పైకి లేస్తున్న దొరల అరాచకానిదా లేక ఇన్ని పోరాటాలు చేసి మన బానిసత్వాన్ని కూడా మట్టిన కలిపినా మళ్లా మన ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టే మనదా? 21st June 2016 ======================================================================== కల నీదీ, నాదీ కాకుండా మనతో పాటు అందరిది అయినప్పుడే అది పోరాట రూప తెచుకుంటది. అలాంటిది నీ కల ఓ పాలకుడి కలగా మాత్రమే తీర్చుకుంటా అంటే ఎట్ల? మల్లీ మొదలవ్వదా పోరాటం?? 21st June 2016 ===================================================================== గెలుపు కష్టపడినోడికే! క...
Comments
Post a Comment