Posts

అమ్మా!

గోరువంక చూపించి గోరు ముద్దలు తినిపించి మాటలతో మరిపించి మా గాయాన్నే మరిపించే   అమ్మా! మీ మాయేంటో తెలుసునే మా జీవితంలో మీ మమతే చాలునే కష్ట కాలం వచ్చిందంటే ఎదురించే శక్తే నీవని ఒడిదుడుకులు ఎన్నీ ఉన్నగాని వెనకడుగే వేయక సాగిపోమని ఇచ్చిన నీ ధైర్యం చాలునే ఈ జీవితాన...    తప్పు తప్పుగా సరిదిద్దుతుంటే   ఒప్పులు తప్పేల అని తప్పుగా భావించానే ఈనాడే తెలిసిందే అమ్మ గొప్పేంటో మనిషిని మనిషిగా మార్చే మీ గణతేంటో నిను వీడాక తెలిసిందే     మిము వీడలేక ఉండలేమని  మీరే ఈ జీవితమూర్తులని..            లోకకర్తలనీ!!! 

ఓ కాలమా!

ఓ కాలమా!    వివరించనా నా స్నేహం నీతో అంటే    నా నేస్తం నీవే అంటే    కష్టకాలం నేర్పించింది    జీవితం గడపడడమెలా అని    తప్పులను సరిదిద్దుకోమని..    సుఖ కాలం నేర్పించింది     ఆనందంలో విహరించమని    నవ్వులతొ జీవితాన్ని నింపుకోమని    కష్టలనే లొపే సుఖాన్నిస్తుంటే    భాద అనే లొపే ఆనందాన్ని పంచెస్తుంతే    కష్టాలు,సుఖాలు,అడ్డంకులు,ఆటుపోట్లు    విజయాలు,పరాజయాలు అన్నీ నీవే ఇస్తుంటే    మనుష్యుల తత్వం తెలుసుకోమని    మానవ నడవడిక నేర్పిస్తుంటే.    జీవిత మదురత్వన్ని నీతో నేర్చేస్తుంటే..  నీ అంత మంచి నేస్తం వేరెవరు??? నాకెవరు???

నా ఈ భావన

ఆశల తీరంలో ఆశయాల అడవుల్లో వీడిన బంధుత్వాలకు తోడైన బంధంగా వెనకడుగు వేసే సమయానా వెన్నంటే నిలిచావు చిరునవ్వుల నీ కోపం ఆప్యాయమైన నీ విసుగు అప్పుడప్పుదు నీ చిరాకు ఎల్లప్పుడు నాతో ఉండాలని నీ మాటలు వీచే చల్లగాలిలా.. నీ నవ్వులు నవ వసంతంలా.. ఆనంద దీవులు ఎల్లప్పుదు నీ వెంటే ఉండాలనీ కోటి హ్రుదయాల  భావనగా ఆకాంక్షిస్తున్నాను

ఎదురుచూపు

ప్రతీ జ్ఞాపకం నీదై నా ప్రతీ వ్యాపకం నీవై ఎదురుచూస్తున్నది ఓ నేస్తం  నా సంతోషం నీ కోసం.. జాలువారే నీ నవ్వు కోసం.. నన్ను పలుకరించె నీ మాటకోసం.. ఆనందం దరికి చెరుతుందని పొంగి పారుతున్న ఆ గంగా నదిలా మన స్నేహం... వాన కాలం కొసం ఎన్నడు ఎదురుచూడదు దు:ఖం వస్తున్నా  అది నిన్ను చూసి .. నా దరి చేరడం ఆపేసింది. దూరమైనామని పొరపడి గెలిసి ఓడి ఆశ్ఛర్యంలో మునిగిపోతుంది పాపం తెలీదేమో దానికి కనుల దూరంలో లేకున్నా  మన కనులు ఒకటే చూస్తున్నాయని  మన మనసులు ఒకటే ఆలోచనలో ఉన్నాయని

ఆకలి పోరాటమా...

ఆకలి పోరాటమా లేక ఆకలికయ్ పోరాటమా.... అమ్మా! అన్న పిలుపు ఆ అన్నపుర్నకు వినబడలేద? లేక ఆకలికయ్ పోరాటం చేస్తున్న వారి దాత అయి అలసి సొలసి నిధ్రుస్తుంద ? ఆకలి పోరాటమే ఆకలికి పోరాటమని పోరాబదింద? అమ్మా..ఆకలి! అన్న పిలుపు అమ్మకే ఆకలిన నాడు కధలలేదా ఆ దాత కరము ఆనాడు కరగాలేదా తన మది ఆ రోజు ... లేక ఓహ్ దాత ! దానం కోసం మది తల్లడిల్లుతున్న పైసా మున్దోచి ఆహ దీనమైన మూమూ దుర్హినంగా కనిపించి దూరం చేసిందా? అదేంటో కానీ.. ఆనాటికి,ఈనాటికి తీరిందో ,లేదో ,ఏమయిందో ఆ దాత మది కరిగిందో,కదిలిందో,ఏమందో కానీ, ఆశ్చర్యార్ధకమాయ్,అనలోచితమాయ్ చూస్తూనే ఉన్నదీ ఆ రోజు కదిలిన నా మదిని

నువ్వే !!!

అన్నిటా నువ్వే  అంతటా నువ్వే  అలలా వచ్చి  కోవలై వెలసి ఆత్మీయత రాగాలే పంచి అనురాగపు సందడిలే పెంచి ప్రేమనే ఒడిలొ ప్రళయమనే భావుతానే మిగిల్చి ఈనాడు పిలిచినా పలకవేమి ఏనాడు వీడనని మరిచిపోయి.. ఎడారినె మరల చేర్చి అదవిలొ మరల దూర్చి పిలిచినా పలకవేమి ఏనాడు వీడనని మరచిపోయి.. ప్రేమనే ముంగింత్లో  సంక్రాంతి ముగ్గులలో ఆత్మీయ రాగాలే మామిడాకులైతుంటే ఈనాడు ఆ అనురాగాలు సంకెళ్లే కాదా!! ఆనాటి బంధుత్వాలు జీవితాల ఆ లోకాలు ఈనాడు విడిచి వీడనని మరిచిపోయి వెలుతుంటే ఏమని చెప్పేది.. ఎంతని ఆపేది.. పొమ్మని చెప్పలేక.. పోతుంటె చూడలేక.. పిలిచినా పలకకా ....

ఏ రోజు ఏమి జరుగునో????

ఏ రోజు ఏమి జరుగునో  ఎవరికీ మాత్రం తెలుసును కళ్ల ముందు జరిగేదేదో  కళ్లు మూచి తెరిచే లోపే జరిగిపోవునే  జరిగింది జరుగుతుందేమోనని  జరిగేది జరగబోయేది తలచి మురవడం ఊహించిందే జరగాలంటూ  తలచిందే కనపదాలంటూ ఆఘ్న వేయడం,ఆలోచించడం ఆగ్రహించడం,ఆవేధనచెంధడం  ఎంత వరకు న్యాయం? ఎంధరికిది సాధ్యం? విధి నీ హస్తమ? లేక     విధి నీ నేస్తమా? కాళ్ళ ముందు జరిగింది  నీ దరికి నవ్వుతోని స్వీకరించేది  హాయిగా జీవించునది విజయాలకు చేరువ అది విజయభాటలో పయనించేది అది కానీ, భాదపడడం కాదు ఈ విధి మీద నీ నిందలు కాదు