Posts

ఆశ కోసం...

ఆశ కోసం... అందమెంతో ఉందనుకున్నా అనర్దమైన జీవితంలో ఆటంకాలెన్ని ఎదురొచ్చినా  ఆటలే అన్నీ అని ఆకర్షితమయ్యా ఇక్కట్లే ఎన్ని వచ్చినా  ఇష్టంగా తలొగ్గిన..తలెత్తినా..ఎదురొడ్డినా... విమర్శలే ఎన్ని చేసినా సున్నితమైన నా మనసు తట్టుకోలేదని తెలిసినా ప్రేమ అనే కొవ్వత్తిని ఏనాటికైనా వెలిగించాలని  అనుబంధమనేది ఆచరనే అవ్వాలని  ఆప్యాయతలు ఆపద్భాంధవుడై తోడు నిలవాలని  గాయాలను గుండెలోనే దాచి నా ఆశయానికి ఆశనే మందుగా ఇస్తూ ఇలా వేధాంత విధానాలుగ నిలుస్తున్న మనుషుల మనసుల మార్పు కోసం వేచిచుస్తూ  ఆశల కిరణాల కోసం జీవిస్తున్నా...

ఓ ప్రశ్నార్ధకం

మనుషుల మనసులు తెలిపే ఊసులే రావే  మనసుల మర్మము తెలిపే అర్దమే గోచరించదే  ఇలా, అలా, ఎలా అని ప్రశ్నించే నా మనసుకు ఈ ఇలలో అలలా నా జీవితం సాగుతుంది ప్రశ్నించే హక్కు ఏర్పరిచినా  జవాబు రాని ప్రశ్నను ప్రశ్నించడం    మిగిలేనే ప్రశ్నార్ధకం  ???

కల కళ-జీవితం

కలయైనా, కళయైన కలలో కరగనివ్వకు నీ జీవితం కళలో మెరుగుపడనివ్వు ప్రతిక్షణం నీ హృదయ లోగిల్లో తేలి ఆడే ఆ జీవిత మకరందం పొంగనివ్వు శాశ్వతం  నీ కన్నీటి ఒడిదుకుల్లోనైనా  స్వచ్చటి ఆనందాల జడిలోనైనా  తేలియాడాలి నీ జీవన సత్యం.. నిత్యం!!! 

వేదన

విధి ఆడిన వింత నాటకం వేదిస్తుంటే మది పాడిన అనురాగ గానం బాధిస్తుంటే విధిలో విలీనమైన నిన్ను కలత చెందిస్తుంటే ప్రేమ గీతం, ఆప్యాయమైన మాట నిందిస్తుంటే తప్పని భావుస్తుంటే చందమామ మోముపై మిగిలిన మచ్చలా మదిలో ఈ నా తప్పు బాధిస్తుంటే వెంటాడి వేదిస్తుంటే నా మదికేదీ సమాధానం శ్రుతిమించిన నా గానం స్థితి తప్పని నా రాగమ్మ్ స్నేహమే నా తోడు రానంటుంటే  మది నిండిన స్నేహానికి నా మాటేలా నీడైన నా నేస్తం ఇక తోడురానంటుంటే  నీడలోని నా మనసు భావమేలా 

మానవత్వమా....

మానవత్వమా..దైవత్వానికి మరో రూపమా.. నీ జాడే లేక మిగిలిన లోకానికి దారే చూపుమా.. మనిషికి రూపం మానవత్వమైతే మానవత్వం ఉందో లేదో అన్న నా మనసుకి మనిషిని చూపే దారే తెలుపుమా..  ప్రేమా,శాంతి,నిస్వార్థం,త్యాగం మానవత్వ ప్రతి రూపాలైతే మనిషన్న వాడే ఈ లోకంలో ఉన్నాడా? లేడా?? సత్యం,స్వచ్ఛత మానవత్వపు చొటైతే?  మానవ లోకమే లేదా? మనిషన్న వాడే ముందుకు రాడా?? నాశనం,కోపం,ద్వేషం అన్నిటికీ రూపాన్నిస్తుంటే.. ఆర్తనాధాలు.. ఆవేదనలు.. అవరోధాలు.. ఆటంకాలు ఇవి మనసుకి లోకం అవుతుంటే.. మనిషన్న వాడే ముందుకు రాడేంటి? మానవత్వమా..దైవత్వానికి ప్రతిరూపమా.. నీ జాడే లేక మిగిలిన లోకంలో నీకు చొటే నిల్వక నలుగుతున్న రాజ్యంలో  నా దారే ఉందటూ చూపక రావా!!!

youth

నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా... వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా  హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ... నీడజాల్ల అందల్లాన్నే అందుకొని  నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా ఆనందంగా ముందుకు సాగిపోరా.. వానరాల్లాగా  ఆడుతూ పాడుతూ  జీవితమంతా గేన్తులేస్తూ ముందుకే సాగిపోతూ  విజయపతకానికే చేరుకోర... ఎన్ని హదులోచినా,ఆటంకాలే ఎదురయ్నా..  ఎదురించీ శక్తే వారయ్యి  దుసుకుపోరా             ముందుకు వారే సాగిపోరా .. ఆశలన్నిటికి రెక్కలు కట్టి సంతోషాన్నే  అందుకోని జీవితాన్నే చిన్ని స్వర్గంగా మార్చుకోరా.. కృషి పట్టుదలే ఆయుధంగా మార్చుకొని      విజయమే వారి బానీసగా చేర్చుకొరా... నీలిమబ్బుల్లా ఆశలన్నీ కమ్మివేసినా... వాన చినుకుల్లాగా సుఖాల్లన్ని ఒక్కసారి మారిపోయినా  హరివిల్లులయ్ వారె నిలిచిపోరా ... నీడజాల్ల అందల్లాన్నే అందుకొని  నీటి సెలయేల్లా అడ్డంకులే ఎదురయినా ఆనందంగా ముందుకు సాగిపోరా.. వానరాల్లాగా  ఆడుతూ పాడుతూ  జీవితమంతా గే...

అమ్మా!

గోరువంక చూపించి గోరు ముద్దలు తినిపించి మాటలతో మరిపించి మా గాయాన్నే మరిపించే   అమ్మా! మీ మాయేంటో తెలుసునే మా జీవితంలో మీ మమతే చాలునే కష్ట కాలం వచ్చిందంటే ఎదురించే శక్తే నీవని ఒడిదుడుకులు ఎన్నీ ఉన్నగాని వెనకడుగే వేయక సాగిపోమని ఇచ్చిన నీ ధైర్యం చాలునే ఈ జీవితాన...    తప్పు తప్పుగా సరిదిద్దుతుంటే   ఒప్పులు తప్పేల అని తప్పుగా భావించానే ఈనాడే తెలిసిందే అమ్మ గొప్పేంటో మనిషిని మనిషిగా మార్చే మీ గణతేంటో నిను వీడాక తెలిసిందే     మిము వీడలేక ఉండలేమని  మీరే ఈ జీవితమూర్తులని..            లోకకర్తలనీ!!!