Posts

ఏమి కరువైంది నా భారత భోగానికి!!!

ఏమి కరువైంది నా భారత భోగానికి కుల మతాల కుతంత్రమున్నా కుల్లిపోని మానవత్వం హత్యలు, నేరాలు ఎనున్నా శాంతికి ఇంకా మారని చిహ్నం మలినమైతుంది సంస్కృతి అన్నా మనసుతో మాట్లాడే జీవం చదువు, ఆరోగ్యం అందని వాలున్నా విశ్వానికి ప్రత్యక్ష భోదనల నిలయం పేద జీవితాలు ఎన్నో ఉన్నా విశ్వమంత దోచుకునేంత నిధుల సమూహం కలయిక లేని భాషలున్నా మనసులను కలిపే భావం ద్వేషాన్ని చిమ్మించే వారే ఉన్నా విడిపోక భాయి భాయి అనే ఏకత్వం గొంతులను నొక్కెట్టే నిరంకుశత్వం విజృంభిస్తున్నా ప్రజ్వలించేను విప్లవ రాగం శాస్త్రీయ, సాంకేతికతకి ముందు పీఠ వేయకున్నా వాటిని శాసించే దిగ్గజాల మాతృమూర్తి అవినీతిలో కూరుకుపొయినా RTI ని సంపాదించిన ప్రజా ఉద్యమ క్రాంతి నాణ్యత లేమికి చిహ్నం అని వేలుచూపినా లోకాన్ని అబ్బురపరిచే చౌక ప్రయోగాల బిందువు కాలుష్యం, కల్మశం ఎన్నున్నా నిత్యం పలకరించే స్వచ్చమైన ప్రకృతి ఫారేన్ దేశాల మోజున్నా దేశీయ అందాల ఆస్వాదన ప్రపంచ జీవన శైలి నిలవలేకున్నా మనషుల జీవన పరిపూర్ణత ఏమి కరువైనది నా భారత భోగానికి!!!

విను ఓ నా లోకం!!!

పొద్దున్నే లేసి పడకెక్కే దాక రియ్యు రియ్యు మంటు తిరిగే నా లోకం అటుపక్క సిన్నారుల రింగుబిల్ల ఆట సూడు రింగంత భూమిని సుట్టేస్తున్నంత నవ్వుల జలపాతం ఇటుపక్క కోయిల కూ కూ రాగాలకు నర్తించే పూ కొమ్మని సూడు ఆస్వాదించే అమ్మ నాన్నా పలుకులు అంధించ నిలుచున్నది చూస్తూ సూటు, బూటు ఏసుకొని బుక్కు, ఫైలు చేత పట్టుకుని కార్ ల తుర్రమన్న వైనం భూమంత అల్లిన పచ్చని పానుపుపై నీ పాదం స్పర్శించి చూడు గుండె బరువుని, బుర్ర వేడిని తనలో ఆవహించుకునే మురిపెం అలసి సొలిసిన నీ తనువుని కాస్త చేయనీయకు మారం పొద్దెక్కినాక అస్తమించే సూరీడు మరల రావలి పాపం!

ఓ సామ్రజ్యవాద నాయకుల్లారా

కడతేర్చె కలలు కని కుతంత్రాలతొ కుల్లిపోయిన కరుడుకట్టిన కల్లోల వాదులారా! ఓ సామ్రజ్యవాద నాయకుల్లారా!! ప్రజల పక్షం నిల్వక దోపిడిని ఎంచుకున్న మీకు న్యాయం పక్షాన నిల్వక సమన్యాయం అంటు అన్యాయనితో స్నేహం చేసే మీకు మాట మీద నిలబడక ప్రజల మనోభావాలతొ ఆడుకునే మీకు ప్రజల ఆకాంక్షను వోటు బ్యాంకు చేసి ఉన్మాద శక్తులను ఖండించక ప్రొత్సహించె మీకు రాబోయె ప్రజల హితవు శాంతించే ఒపిక కంటి విడుపు మీ అరాచక రోజుల సమాప్తపు గడువు

తెలంగాణం

భూమి, నీరు నా పంటా చేను బొగ్గు  బావి అయినా కరెంటు కోత టెక్స్టైల్సు,మిల్సు అన్నీ కూల్చివేత ఏర్ఫీల్డు పోర్టుగా మారని తలరాత డిగ్రీలు, పి.జి. లు అని ఎన్నీ చద్వినా కూటికి,పూటకి దిక్కే లేదురా తెలుగు భాషా ఒకటే అంటున్నా మా యాసా ఘోష ఎవరికి ఎక్కేనురా.. అరవయ్ ఏళ్ల బానిసత్వం వాక్కు హక్కు లాఠీ మింగినా కేసులు,షీట్లు, ఎన్నో నింపినా రక్తపు బొట్టు నేలే రాలినా  కన్న ప్రాణాలు కొట్టుకు పోయినా  కసాయిధారులు రాజ్యమేలినా  నినాదపు గొంతులు నిమిరేసినా.. స్వరమవ్వురా.... నువూ,నేను అన్నాదమ్ములంటా  విడిపోతే ఇద్దరం సమతుల్యమంటా ||2|| కలిసుండి ఎవరికి నోచని భాగ్యమే ఎందుకురా  విడిపోయి సమైక్యంగ అభివృద్ది నిచ్చనే ఎక్కేమురా నువ్వు,నేను అంతా సహోదరులేరా..

నా డైరీ..

ఇది కలలో నిదురించేది కాదు కవితలు స్రిష్టించేది కూడా.. కలం యొక్క పట్టువిడుపే కాదూ కళ యొక్క సంత్రుప్తి కూడా.. ఇది మాటల పలకరింపులే కాదూ నా మనసు యొక్క ప్రతిబింబం కూడా.. ఇక్కడ మాటల గారడీయే కాదూ మనసులు ఏర్పర్చిన పేరడీ కూడా.. ఇది డైరీ యే కాదూ నా భావోద్వేగాల కలయిక కూడా... నా కలల అన్వేషణ కూడా న మనసుని ఉరికిస్తున్న నా జీవితం కూడా... 

మన భారతదేశం.....

భారతదేశపు ఘన చరిత్ర గగనానికి చేరినా..గాలిలా విస్తరించినా చరిత్ర ఎన్నో వాస్తవాలు భోదించినా.. దైవ ఘటన ప్రాప్తో ఎమో గానీ మారిందె.. మార్పుకు గురయందీ మనుష్యుల హ్రుదయాలు, మనసుల స్వభావం కాదు.. చదివినా..చదవకపొయినా.. ఆకరికి కంగుతిన్నది మానవత్వము.. ఎది ఏమైన..    దిగజారిన ఆలొచనా శక్తే  నవ భారతపు నిజ స్వరూపం.. 

ఓ ప్రజానాయకులారా!!!

అన్యాయానికి ప్రతిరూపమా అవినీతికి మారుపేరా ఓ ప్రజానాయకులారా!!! ప్రజల వలన ప్రజల కొరకూ ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పాలకులార ప్రజల కష్టాన్ని ధగాచేయమని.. ప్రజల రక్తాన్ని దోచుకోమని ఉన్నత్తంగ ఉన్మాదానికి పాలుపడమన్నదా?? నీ ఈ ప్రజాస్వామ్యం తన న్యాయ కోరిక తీరుతుందెమో అని తన కలల స్వప్నం చుస్తానేమో అని ఓటు వేసిన ప్రజలకు మిగిల్చెది మట్టి చెతులు,ఎండమావులేనా.. కర్షకులకు..కార్మికులకు కడతేల్చిన కర్మాగారాలు రైతన్నలకు,నేతన్నలకు చూపించే ఉరితాళ్లు చిన్నూలకు,నవతరాలకు మిగిల్చిన కాలీ కదుపులా??? ప్రమానం ఏమో ప్రజలకొసం ప్రయానమేమో మీ బాంకు ఖత కొసం.. ఏమి మీ అంతర్మథనం ఎందుకు మాకీ ఆక్రోషం!