వేదన
విధి ఆడిన వింత నాటకం వేదిస్తుంటే మది పాడిన అనురాగ గానం బాధిస్తుంటే విధిలో విలీనమైన నిన్ను కలత చెందిస్తుంటే ప్రేమ గీతం, ఆప్యాయమైన మాట నిందిస్తుంటే తప్పని భావుస్తుంటే చందమామ మోముపై మిగిలిన మచ్చలా మదిలో ఈ నా తప్పు బాధిస్తుంటే వెంటాడి వేదిస్తుంటే నా మదికేదీ సమాధానం శ్రుతిమించిన నా గానం స్థితి తప్పని నా రాగమ్మ్ స్నేహమే నా తోడు రానంటుంటే మది నిండిన స్నేహానికి నా మాటేలా నీడైన నా నేస్తం ఇక తోడురానంటుంటే నీడలోని నా మనసు భావమేలా