Posts

Showing posts from 2014

ప్రయాణం

అది ఒక పల్లెటూరు పక్కనున్న ఓ చిన్న పట్టణము. గజిబిజిగా, గంభీరంగా ఉండే ప్రదేశం అది. అటొక మెట్రోపొలిటెన్ సిటీకి, ఇటు పల్లేటూరుకు మధ్యనుండే ప్రాచుర్యం పొందుతున్న ఓ చారిత్రక నగరం. కనుమరుగవుతున్న పల్లెటూరు తత్త్వానికి, అతి చేరువలోవున్నా పూర్తిగా ఆవహించుకోని నాగరికత మధ్యలో జీవిస్తున్న ఆశావాహిత జీవితాలు. వారిలో ఒకరితో ఈ ప్రయాణం... సూరీడు తన కాంతులను వెదజల్లకముందే తన చూపులతో ఈ లోకాన్ని స్వాగతిస్తూ తన ఇంటి ద్వారాన్ని తెరుస్తూ నడక ప్రారంభించాడు పొడుగాటి, బకపలుచని తాత, తన జీవిత అనుభవాల బరువుతో. అయినా దరి రాడే ఈ సూరీడు?? ఆ పాప చిరునవ్వుల కాంతి వెదజల్లకుండానే ఏల సూరీడు. అగొ, అదిగో చెవులు, కనులు రెండూ ఒక్క సారే తెరలేపినయి జీవన క్రాంతి వెతుకులాటని ఆ ఇంటిలొ. అటు, ఇటు గెంతులేస్తూ, అందరిని ఆగం చేసి లేపి, తన చిన్నరి పాదాలతో ఈ భువిని పలకరిస్తూ పులకింపజేస్తు తన కలనే వెంటాడుతున్న అన్నంత వేగంతో తడబడుతూ, ముందుకెళ్తూ దూసుకుపోతుంది తన గది నుంచి మరో గదిలోకి. బెడ్ పైకి ఎక్కి భామ్మ అంటూ మోము పై చిట్టి చేతులను రాల్చి లేపబోయి పడుకున్న ప్రశాంతతను చూసి ఆగిపోయింది. మెల్లిగా అవ్వ భుజాన తలబెట్టి మళ్లీ ఆహ్వానించింది అందరి...

On Panthankot Attack

పసి మొగ్గలను తుంచేస్తే ఏలరా? పూ తోటలు ఎలా పూయును మానవత్వ పరిమలం ఎలా పర్వసించును ఈ భువి పై??? #‎FightAgainstTerrorism‬

reminiscing bhamma (Grand Ma)

కదలాడే కలవైనా కదలలేని శిలవైనా నీ తోడు నాకై ఉండె కడదాక జీవించు నీవు నా శ్వాస తుది దాక Nov 23,2014 =============================================== ఈ నిశబ్ద సందర్భాన్ని అహ్వానిస్తాననుకోలేదు ఎన్నడు!!! Dec 2,2014 =============================================== ఓ కాలమా ఎటుపోతివే నా జాడలే కానరానియ్యక Dec 7,2015 ================================================ తప్పిపోయిన ప్ర్రాయం.. వెనక్కి వచ్చి.. తెచ్చి ఇచ్చేనా ప్రాణం! Dec 13,2014 ================================================ కన్న పేగుకి కాసంత దూరాన ఉన్న కూనా ఎందుకమ్మా నీకింత ప్రేమ!! Dec 15, 2014 ================================================

ఏదేమైనా!

కదలాడే కలవైనా కదలలేని శిలవైనా నీ తోడు నాకై ఉండె కడదాక జీవించు నీవు నా శ్వాస తుది దాక

వెందుకు??

ప్రేమకి అర్ధం తెలిపిన నీకు ప్రేమ కావ్యాన్ని అందించకముందే పయనించినవెందుకు?? నా జీవన రాగానికి గమకానివి నూ పాట పూర్తిగాకుండానే గతించినవెందుకు??

బామ్మ!

బామ్మ! పసి పాప లా లాలించిన నీ రూపం కన్నీటికి బిందువై తోడైన నీ రూపం నా చిరునవ్వుకు చిరునామ నీ రూపం సుడిగుండపు జీవితాన తీరం నీ రూపం అలసి సొలసిన వేల సేద తీర్చు నీ రూపం చిన్ననాటి చందమామకథల నిలయం నీ రూపం నే మొదలెట్టిన కవిత్వా సంపుటి నీ రూపం నా అంతర్గత భావానికి భాష్యమయ్యె నీ రూపం నా నవ్వులు పెంచు చిరునవ్వు నీ రూపం నే ఓడిన క్షణాన ఓదార్పు నీ రూపం నే గెల్చిన నాడు విజయభింభిక నీ రూపం నా వెన్నుతట్టు ఆత్మస్థైర్యం నీ రూపం నే కదలాడె స్వప్నాల ఆచూకి నీ రూపం నా మనసుకి మమథ కి ప్రతిరూపం అదృష్యమైతుందని తెల్సిన క్షణాన ఏమవు నా ప్రాణం అంతు తోచలేదా ఏ ఒక్క క్షణం

1.బామ్మ!

జీవనాన్ని నేర్పిన జీవం నువ్వు నా నడకకు ఆదారం నువ్వు విప్లవ సారానికి తల్లివి నువ్వు త్యాగానికి ప్రతీక నువ్వు మా అందరి చిరునవ్వుకు చిరునామా నువ్వు సుడిగుండపు జీవితాన తీరం నువ్వు ఎందరొ కడుపు నింపిన అన్నపూర్ణవి నువ్వు ప్రేమకి నిలువుటద్దము నువ్వు ఎలా వర్ణించను బామ్మా నిన్ను మా ఈ ఎడారి జీవితాన ఆచూకీ నీవనీ --నీ ప్రతిబింబం

ఏమైంది నా భారత దేశానికి

ఏమైంది నా భారత దేశానికి దీనంగా దాసియై నిలుచుంది!!! భిన్నత్వంలో ఏకత్వం మాదని ప్రగడ్పాలు పలికినా మతాల మధ్య వైరుద్యాన్ని పెంచే ప్రక్రియలకె పూనింది దైవత్వమే పరమావధి అని భోదించినా మానవ సేవే మాధవ సేవ అన్నవే మరచినది ఓ తల్లిగా, శక్తిగా పూజింపబడే స్త్రీని అభాగ్యురాలిగా. నిస్సహాయ జీవిగ మిగిల్చింది అతి పెద్ద ప్రజాస్వామ్యపు నిలయమైనా ప్రజల హక్కులను కాలరాల్చే నియంత్రుత్వపు దోసిల్లు చాచింది ఏమైంది నా భారత దేశానికి దీనంగా దాసియై నిలుచుంది!!! వీరోచ్చిత ఘట్టాలను ప్రపంచ చరితకు అంధించన భాగ్యం కనుమరుగయినై ఈ దేశాన ఆ ఆనవాలకు భోగం స్వతంత్ర్య దినాన్ని వైభవంగా జరుపుకునే దేశం ఆ విప్లవ కాంక్షను అరవై ఏళ్లైనా నిలపలేకపొయిన సంకల్పం యంగ్ ఇండియా అని నిర్వర్చించినా పేరు వారికి మిగిల్చింది నిలువ నీడలేని ఊరు ఏమైంది నా భారత దేశానికి దీనంగా దాసియై నిలుచుంది!!!

ఏమి కరువైంది నా భారత భోగానికి!!!

ఏమి కరువైంది నా భారత భోగానికి కుల మతాల కుతంత్రమున్నా కుల్లిపోని మానవత్వం హత్యలు, నేరాలు ఎనున్నా శాంతికి ఇంకా మారని చిహ్నం మలినమైతుంది సంస్కృతి అన్నా మనసుతో మాట్లాడే జీవం చదువు, ఆరోగ్యం అందని వాలున్నా విశ్వానికి ప్రత్యక్ష భోదనల నిలయం పేద జీవితాలు ఎన్నో ఉన్నా విశ్వమంత దోచుకునేంత నిధుల సమూహం కలయిక లేని భాషలున్నా మనసులను కలిపే భావం ద్వేషాన్ని చిమ్మించే వారే ఉన్నా విడిపోక భాయి భాయి అనే ఏకత్వం గొంతులను నొక్కెట్టే నిరంకుశత్వం విజృంభిస్తున్నా ప్రజ్వలించేను విప్లవ రాగం శాస్త్రీయ, సాంకేతికతకి ముందు పీఠ వేయకున్నా వాటిని శాసించే దిగ్గజాల మాతృమూర్తి అవినీతిలో కూరుకుపొయినా RTI ని సంపాదించిన ప్రజా ఉద్యమ క్రాంతి నాణ్యత లేమికి చిహ్నం అని వేలుచూపినా లోకాన్ని అబ్బురపరిచే చౌక ప్రయోగాల బిందువు కాలుష్యం, కల్మశం ఎన్నున్నా నిత్యం పలకరించే స్వచ్చమైన ప్రకృతి ఫారేన్ దేశాల మోజున్నా దేశీయ అందాల ఆస్వాదన ప్రపంచ జీవన శైలి నిలవలేకున్నా మనషుల జీవన పరిపూర్ణత ఏమి కరువైనది నా భారత భోగానికి!!!

విను ఓ నా లోకం!!!

పొద్దున్నే లేసి పడకెక్కే దాక రియ్యు రియ్యు మంటు తిరిగే నా లోకం అటుపక్క సిన్నారుల రింగుబిల్ల ఆట సూడు రింగంత భూమిని సుట్టేస్తున్నంత నవ్వుల జలపాతం ఇటుపక్క కోయిల కూ కూ రాగాలకు నర్తించే పూ కొమ్మని సూడు ఆస్వాదించే అమ్మ నాన్నా పలుకులు అంధించ నిలుచున్నది చూస్తూ సూటు, బూటు ఏసుకొని బుక్కు, ఫైలు చేత పట్టుకుని కార్ ల తుర్రమన్న వైనం భూమంత అల్లిన పచ్చని పానుపుపై నీ పాదం స్పర్శించి చూడు గుండె బరువుని, బుర్ర వేడిని తనలో ఆవహించుకునే మురిపెం అలసి సొలిసిన నీ తనువుని కాస్త చేయనీయకు మారం పొద్దెక్కినాక అస్తమించే సూరీడు మరల రావలి పాపం!

ఓ సామ్రజ్యవాద నాయకుల్లారా

కడతేర్చె కలలు కని కుతంత్రాలతొ కుల్లిపోయిన కరుడుకట్టిన కల్లోల వాదులారా! ఓ సామ్రజ్యవాద నాయకుల్లారా!! ప్రజల పక్షం నిల్వక దోపిడిని ఎంచుకున్న మీకు న్యాయం పక్షాన నిల్వక సమన్యాయం అంటు అన్యాయనితో స్నేహం చేసే మీకు మాట మీద నిలబడక ప్రజల మనోభావాలతొ ఆడుకునే మీకు ప్రజల ఆకాంక్షను వోటు బ్యాంకు చేసి ఉన్మాద శక్తులను ఖండించక ప్రొత్సహించె మీకు రాబోయె ప్రజల హితవు శాంతించే ఒపిక కంటి విడుపు మీ అరాచక రోజుల సమాప్తపు గడువు